
What is the Reason for Celebration of Holi?
1హోలీ పండగ
Holi 2025 Date
మార్చి 14, 2025 శుక్రవారం హోలీ
హోలికా దహన్, గురువారం, మార్చి 13, 2025
పూర్ణిమ తిథి ప్రారంభం – మార్చి 13, 2025న 10:35
పూర్ణిమ తిథి ముగుస్తుంది – మార్చి 14, 2025న 12:23
హోలీ సంబరాలు
నేడు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. చిన్నా పెద్దా అందరూ, అన్నీ మతాలవారూ రంగుల పండుగలో పాల్గొంటారు.
ఫాల్గుణ శుక్ల పౌర్ణమినాడు హోలీ పండుగను జరుపుకుంటాం. ధవళ కాంతులను విరజిమ్మే పౌర్ణమి నాటి వెన్నలని హోలీ రంగులతో నింపి ఆహ్లాదాన్ని అనుభవించడం హోలీ పండుగ ప్రత్యేకం. నేపాల్ ప్రాంతంలో హోలీని జాతీయ పండుగగా జరుపుకుంటారు.
హోలీ పండుగ జరుపుకోడానికి గల కారణాలు (Reasons Behind to Celebrate Holi)
హోలీ పండుగ గురించి ఒక్కో ప్రాంతం ఒక్కో కథ వినబడుతుంది. దక్షిణ భారతదేశం లో హోలీ పండుగ ను కాముని పున్నమిగా పిలుస్తారు.
ఉత్తర భారతదేశం లో హోలీ పండుగను కొన్ని చోట్ల లాత్ మార్ హోలీ అని పిలుస్తారు. అబ్బాయిలు కృష్ణ స్వరూపాలుగా ఆడపిల్లలు రాధా స్వరూపాలుగా భావించి రంగులు చల్లుకుంటూ ఆనంద నృత్యాలు చేస్తారు. హోలీ పండుగ వెనుక ప్రధానంగా మూడు కథలు ఉన్నాయి.
Holi Stories
పండుగ కథ 1 (Holi Story 1)
ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్య కశిపుడు అతని విష్ణుభక్తిని సహించలేక పోతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు నారాయణ నామ స్మరణను మానలేదు.
దాంతో ప్రహ్లాదుని అగ్నిలో కాల్చి చంపాలని అతని తండ్రి హిరణ్య కశిపుడు నిశ్చయించుకుంటాడు. మంటలనుంచీ పారిపోకుండా ఉండటానికి హిరణ్య కశిపుని అక్క హోళిక ప్రహ్లాదుని తన వొడిలో పట్టుకుని మంటలలో కూర్చుంటుంది.
హోళిక తనకు మంటలవల ఎటువంటి హానీ కలగకుండా ఒక మాయా వస్త్రాన్ని కప్పుకుని కూర్చుంటుంది.
కానీ ప్రహ్లాదుని హరిణామ స్మరణ వలన ఆ మాయా వస్త్రం హోళిక మీదినుంచీ తొలగిపోయి ప్రహ్లాదుని కప్పి రక్షిస్తుంది.
ఎన్నో ఏళ్లుగా దేశ ప్రజలను వేధిస్తున్న హోళిక బాధ తొలగిపోవడం తో ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. హోళిక మరణం వలన వచ్చింది కాబట్టే ఆ పండుగకు హోలీ అన్న పేరు వచ్చిదని అంటారు.
పండుగ కథ 2
సతీ దేవి మరణం తరువాత పరమేశ్వరుడు విరాగియై ధ్యానం లో మునిగిపోయి ఉంటాడు. ఆయన కోసమే మళ్ళీ జన్మించిన, సతీదేవి రూపమైన హైమవతిని గుర్తించడు.
జగత్కల్యాణ కారకమైన వారి వివాహం జరపడం కోసం, పరమేశ్వరునికి హైమవతిపై అనురాగాన్ని కలిగించేందుకు దేవతలంతా కలిసి మన్మధుని పురమాయిస్తారు.
మన్మధుడు పార్వతీ దేవి పరమేశ్వరుని చెంతకు చేరిన సమయం లో ఆయనపై పుష్పబాణాన్ని ప్రయోగిస్తాడు.
పుష్పబాణ ప్రభావం తో పార్వతిపై పరమేషుడు మోహితుడౌతాడు. కానీ వెంటనే తన ధ్యాన భంగానికి కారణం తెలిసి మూడో కన్ను తెరిచి మన్మధుని భస్మం చేస్తాడు.
సృష్టికి మూలమైన ప్రేమ జనించాలంటే రతీమన్మధులు లేకుండా సాధ్యం కాదు కదా. మన్మధుని ముక్కంటి భస్మం చేయగానే అతని భార్య రతీదేవి తన భర్తను బ్రతికించమని పరమేశుని వేడుకుంటుంది.
రతీ దేవి శోకానికి కరిగిన పరమశివుడు మన్మధునికి కామరూపునిగా జీవించమని వరమిస్తాడు. ద్వాపర యుగం లో శ్రీ కృష్ణుని కి పుత్రునిగా జన్మించి తిరిగి రూపాన్ని పొందగలవని చెబుతాడు.
కాముని పరమేషుడు దహించిన రోజు కనుక ఆ రోజున కామ దహనాన్ని జరుపుకుంటారు. కాముని పున్నమిగా భావిస్తారు. మన లోని అసందర్భమైన కామాన్ని దహించడానికి గుర్తుగా కాముని దహనాన్ని జరుపుతారు.
పండుగ కథ 3
వ్రజ పురం అంటే ఇప్పటి గుజరాత్ లోని బ్రజ్ ప్రాంతం లోని బర్సానా శ్రీకృష్ణుని ప్రియ సఖి అయిన రాధ ఉండే ప్రాంతంగా చెబుతారు.
అక్కడ ఇప్పటికీ హోలీ పండుగనాడు శ్రీకృష్ణుడు నివసించిన నందగావ్ లోని మగపిల్లలంతా తాము శ్రీకృష్ణ స్వరూపాలుగా భావించి బర్సానాలోని రాధారాణి ఆలయం వద్ద విజయ చిహ్నంగా జెండాలు పాతుతారు.
బర్సానా లోని ఆడపిల్లలు తమను తాము రాధా స్వరూపాలుగా భావించి లావుపాటి కర్రలతో వాళ్లను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తారు .
చివరిరోజున ఇరుపక్షాలూ రంగులు చల్లుకోవడంతో ఈ వేడుక ముగుస్తుంది.
అందుకే ఈ వేడుకను ‘లాత్‌మార్ హోలీ’ అని అంటారు. బంగారు వంటి రాధ మేని ఛాయతో తన నల్లని రూపాన్ని పోల్చుకుని కృష్ణయ్య చిన్నబుచ్చుకుంటే యశోద రాధ వెుహానికి ఇంత రంగుపూసిందనీ అలా ఈ పండగ వెుదలైందనీ చెప్పే కథలు ఉత్తర హిందూ దేశం లో ప్రాచుర్యంలో ఉన్నాయి.
పండుగనాడు చేయదగిన వ్రతాలు (Holi Vrat Puja)
హోలీ పండుగ నాడు సత్యనారాయణ స్వామి వ్రతాలు, అశోక పూర్ణిమా వ్రతం, చంద్రవ్రతం చేస్తారు…..
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
Follow HariOme WhatsApp Channel
Related Posts
Stories Behind the Festival of Colours Holi in English | Holi Stories
కాంతి వంతమైన శరీరం పొందాలంటే ఏం చేయాలి? | How to Get Glowing Skin in Telugu
చర్మ రోగాలను నయం చేసే వరుణ ముద్ర | Varuna Mudra To Cure Skin Diseases in Telugu
చర్మ వ్యాధులకు దివ్య ఔషధం | skin diseases medicine in Telugu
మెరిసే చర్మం పొందాలంటే ఆయుర్వేదం ఏమి చెప్తుంది ? | Ayurveda Skin Care Tips in Telugu