
Aishwarya Deepam Rituals & Lighting Procedure
4ఐశ్వర్య దీపం వెలిగించే విధానం (Method of Lighting Aishwarya Deepam):
1. ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపం.
2. ప్రతి శుక్రవారం రోజున 2 పెద్ద ప్రమిదలు తీసుకొని వాటికి పసుపు, కుంకుమ రాయలి.
3. పసుపు, కుంకుమ మరియు బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపై ఆ ప్రమిధలు ఒకదానిపై ఒకటి పెట్టాలి.
4. ఆ ప్రమిదలో ఒక 1/4 కిలో కల్లు ఉప్పు వేసి ఆ ఉప్పు పైన పసుపు, కుంకుమ వేయాలి.
5. మరోక చిన్న ప్రమిధలు 2 ఒకదానిపై ఒకటి పెట్టి ఆ పెద్ద ప్రమిదలో ఉప్పు పైన ఉంచాలి.
6. ఆ చిన్న ప్రమిదలో నూనె లేదా నెయ్యి కానీ పోసి 2 ఒత్తులను ఒక వత్తిగా చేసి వెలిగించాలి. ఆ సమయంలో దీపం శ్లోకం జపించాలి.
7. పాలు, పళ్ళు, పటిక బెల్లం మరియు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టాలి.
8. నైవేద్యం సమర్పించే సమయంలో లక్ష్మీదేవి, వేంకటేశ్వరస్వామి, కనకధార స్తోత్రం
జపిస్తే మంచిది.
9. శుక్రవారం రోజున ఇలా దీపారాధన చేసి, శనివారం రోజున ఆ ప్రమిధలు లోని ఉప్పు మాత్రం తీసి పారే నీటిలో కలపాలి.
10. ఇలా అదే ప్రమిదలతో ప్రతి శుక్రవారం రోజున ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజున ఆ ఉప్పు నీటిలో కలపాలి.
11. ఇలా 1, 16, 21, 41 శుక్రవారాలు అనుకోని ఇంట్లో చేసుకోవాలి, ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టాలి.
12. ఈ విధంగా 41 శుక్రవారాలు ఈ ఐశ్వర్య దీపం వెలిగించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
Navaratri Related Posts
విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు | Vijayawada Dasara Navaratri Utsavalu 2024
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
https://hariome.com/how-to-cook-payasam-to-offer-goddess/
శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu
దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?