Shani Trayodashi In Telugu
1శనివారం త్రయోదశీ ఒకే రోజు వస్తే ఏమి చేయాలి..? (What Should be Done if Saturday and Troyodasi Fall on the Same Day..?)
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
శని వారమూ త్రయోదశీ ఒకేరోజు రావడం చాలా విశేషమైనది. శని బాధలనుండీ విముక్తి పొందాలంటే అటువంటి శని త్రయోదశి నాడు ఆ శనీశ్వరుని విధి విధానాలతో ప్రార్థించాలి. ఈరోజు శని దేవుని పూజించడం వలన జాతకం లో ఏలినాటి శని, అష్టమశని, అర్ధాష్టమ శని, శని అంతర్దశ విదశ దోషాలను ,మీ జాతకం లో శనిప్రభావం వల్ల కలిగే ఎన్నోరకాల బాధలనుండీ ఉపశమనాన్ని పొందవచ్చు. వైశాఖ మాసం లో వచ్చే శని త్రయోదశినాడు శనీశ్వరుని జన్మదినం. ఆరోజు శని పూజ చేయడం వల్ల అనేకలాభాలుంటాయి. ఆరోజు మాత్రమే కాకుండా ఏ మాసం లో అయినా శనివారం వచ్చే త్రయోదశి నాడు పూజ చేయడం వలన కూడా అదే ప్రభావాన్ని పొందవచ్చు.
శనివారం వచ్చిన త్రయోదశి నాడు చేయవలసిన పనులు (Things to do on Trayodashi which falls on Saturday)
- నేడు శివారాధన ఎంతో శ్రేష్ఠం.
- తలంటు స్నానం చేసి ఉపవాసాన్ని ఆచరించాలి.
- శని శాంతి పూజను చేయించడం వలన గ్రహప్రభావం తగ్గుతుంది.
- శనికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.
- నల్ల నువ్వులని,నువ్వుల నూనెనీ,బొగ్గునీ, ఎనిమిది మేకు లనూ, ఒక నల్లని వస్త్రాన్నీ, నవధాన్యాలనూ బ్రాహ్మడికి దానం చేయాలి.
- కాకులకు, ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని పెట్టాలి.
- ఇవాళ నూనెను, చర్మం తో చేసిన వస్తువులను, గొడుగునూ కొనకూడదు.
- కొద్దిగా ఉప్పువేసి వండిన అన్నాన్ని గానీ, చిటికెడు ఉప్పు కలిపిన బియ్యాన్ని గానీ పేదవారికి దానం చెయ్యాలి.
శని త్రయోదశి పఠించాల్సిన శ్లోకాలు (Shlokas to Recite on Shani Trayodashi)
ఈ ఆరు శని శ్లోకాలనీ చదువుకోవాలి.
- సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని: - శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే - నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం - నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే - మనస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
నమస్తే సౌరాయే విభో - నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్ర్రణతస్యచ.
శని ప్రదోష వ్రతం 2025 తేదీలు & సమయం (Shani Pradosh Vrat 2025 Dates & Timing)
- శనివారం, జనవరి 11, 2025. త్రయోదశి జనవరి 11న ఉదయం 8:22 గంటలకు ప్రారంభమై జనవరి 12న ఉదయం 6:34 గంటలకు ముగుస్తుంది.
- శనివారం, ఏప్రిల్ 26, 2025. త్రయోదశి ఏప్రిల్ 25న ఉదయం 11:45 am గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 26న ఉదయం 8:28 am గంటలకు ముగుస్తుంది.
- శనివారం, మే 10, 2025. త్రయోదశి మే 9న ఉదయం 2:56pm గంటలకు ప్రారంభమై మే 10న ఉదయం 5:30 pm గంటలకు ముగుస్తుంది.
??????????