
Husband role when Wife is Pregnant in Telugu
1. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త పాటించవలసిన ఆచారాలు
గర్భిణీ వాంఛితం ధర్మం తస్యైదద్యాద్యథోచితం |
సూతే చిరాయుషం పుత్రమన్యథా దోషమర్హతి ||
ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది — గర్భిణీ స్త్రీ ఏదైనా వాంఛితమైనదాన్ని కోరితే, అది సాధ్యమైనంతవరకూ భర్త తాను తెచ్చి ఇవ్వాలి. అలా చేయటం వల్ల చిరాయువు గల కుమారుడు జన్మిస్తాడు. లేనిపక్షంలో భర్తకు దోషం కలుగుతుంది.
భర్త చేయవలసిన ముఖ్యమైన నియమాలు:
-
గర్భిణీ స్త్రీ మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
-
ఆమె కోరిన ఉత్తమమైన, శరీరానికి మరియు మానసికానికి మంచిగా ఉండే వస్తువులను సమర్పించాలి.
-
గర్భిణీకి ఆధ్యాత్మిక ప్రశాంతత కలిగే విధంగా ప్రవర్తించాలి.
భర్త చేయరానివి / తప్పుకోవలసిన విషయాలు:
-
సముద్ర స్నానం – వర్జ్యం.
-
చెట్లు నరికడం, క్షౌరకర్మ చేయడం – మానాలి.
-
శవాన్ని మోయడం, అంత్యక్రియలు చేయడం – వీలైనంతవరకూ దూరంగా ఉండాలి.
-
విదేశయానం లేదా గృహానికి చాలా దూరంగా ప్రయాణాలు చేయడం – నివారించాలి.
-
ఏడవ నెల నుండి:
-
క్షౌరకర్మ, మైథున సంబంధం, తీర్థయాత్రలు, శ్రాధ్ధ భోజనాలలో పాల్గొనడం, నావపై ప్రయాణం – వీటన్నింటినీ మానాలి.
-
గృహ సంబంధ కార్యక్రమాలలో:
-
పర్వతారోహణం, యుద్ధాలు/వివాదాలు, గృహ నిర్మాణం ప్రారంభం, వాస్తు సంబంధ పనులు – వీటిని నివారించాలి.
ఇతర నిషేధిత కార్యాలు:
-
నఖ, కేశాలు కత్తిరించడం
-
బిడ్డకు చౌలకర్మ చేయించడం, వివాహం, ఉపనయనం, పిండప్రదానం, శవ అనుసరణ, ప్రేతకర్మలు – ఇవన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలి.
ఇవి పాటించడం వలన గర్భిణీ స్త్రీకి శరీరపరంగా, మానసికపరంగా ప్రశాంతత లభిస్తుంది. గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా పెరిగి, మంచి లక్షణాలతో జన్మిస్తాడు.
ఇదే సద్గతికి దారితీసే సాంప్రదాయం 🙏
సేకరణ :
రాజశేఖరుని విజయ్ శర్మ
Related Stories:
Ayyappa Deeksha | భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త అయ్యప్ప మాల వేసుకుంటే ఏమవుతుంది?
భర్త అయ్యప్ప దీక్షలో ఉండగా భార్య చేయకూడని పనులు | Ayyappa Deeksha Rules for Wife
Ravana’s wife | ఎవరికీ తెలియని రావణుడి భార్య మండోదరి జీవిత రహస్యం?
భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండటానికి | Ways to stay in love forever for husband and wife
LIKE IT
Good message
Thank you for this good traditional massage
Like.
My.date of brithday.23-12-1991
Time.12:00:AM:WES
Thanks and good massages
Good message sir
kk
Useful msg hari ji thnx to u…
Thank you
great message at right time