
Angarika Chaturthi Significance & Pooja Vidhanam
1అంగారక చతుర్థి: మంగళ గ్రహ బలాలను పొందే పుణ్యదినం.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
హిందూ సంప్రదాయంలో, వారంలోని ప్రతి రోజు ఒక గ్రహానికి అధిపతిగా ఉంటుంది. మంగళవారం నాడు అధిపతి ఎవరో కాదు, మన నవగ్రహాలలో ఒకటైన అంగారకుడు. ఈ అంగారకుడు మన జీవితాల్లో ఎన్నో ప్రభావాలు చూపిస్తాడు. పురుషులకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలను ప్రసాదిస్తే, స్త్రీల జాతకంలో కుజదోషంగా పేరు పొంది, వివాహాల్ని ఆలస్యం చేస్తాడు. అలాంటి మంగళ గ్రహ దోషాలను నివారించుకునేందుకు, అంగారకుడి అనుగ్రహాన్ని పొందేందుకు ఒక విశేషమైన రోజు ఉంది. అదే అంగారక చతుర్థి.
అంగారక చతుర్థి ఎప్పుడు జరుపుకుంటారు?
సాధారణంగా నెలలో వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాం. కానీ, మంగళవారం నాడు వచ్చే చవితినే అంగారక చతుర్థి అంటారు. వారం, తిథి కలయిక వల్ల వచ్చే కొన్ని రోజులు విశేషమౌతాయి. అలాటి విశేషమైన ఒక రోజు – అంగారక చతుర్థి. మంగళవారం, కృష్ణపక్ష చవితినాడు వచ్చే రోజును అంగారక చతుర్థి(25-06-2024)గా జరుపుకోవాలని శాస్త్రవచనం. దీనికి అంగారకచతుర్థి వ్రతం అని పేరు. ఈ రోజున అంగారకుడిని ప్రసన్నం చేసుకుంటే, అతని అనుగ్రహంతో పాటు, వినాయకుని ఆశీస్సులు కూడా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
పురాణాల్లో అంగారక చతుర్థి ప్రస్తావన:
పురాణాల ప్రకారం, ఒకసారి దేవతల రాజైన ఇంద్రుడు తన విమానంలో భూమి మీద ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణం మధ్యలో, ఉన్నట్టుండి ఆ విమానం క్రిందికి దిగి, ఎంత ప్రయత్నించినా పైకి ఎగరలేకపోతుంది. అయోమయంలో పడిన ఇంద్రుడు తన స్నేహితుడైన నారదుడిని కలుసుకుంటాడు. జరిగిన విషయం వివరించగా, నారదుడు “భూమి మీద అంగారక చతుర్థి వ్రతం చేసినవారు ఆ వ్రతఫలాన్ని దారపోస్తే తప్ప, విమానం కదలదు” అని చెబుతాడు. దేవతలు వెంటనే ఆ స్త్రీని వెదికి, ఆమె వ్రత ఫలాన్ని స్వీకరించి, విమానం ద్వారా స్వర్గానికి చేరుకుంటారు. ఆ స్త్రీ జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించి, చివరికి స్వర్గలోకానికి చేరుకుంది.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.