సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?

0
583
Why Sankranti is Celebrated 3 Days
Why Makara Sankranti is Celebrated in 3 Days?!

Why 3 Days of Sankranti Celebrations?

1మూడు రోజుల సంక్రాంతి సంబరాలు ఎందుకు?

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

సంక్రాంతి ముందు వచ్చే రోజుని భోగి అని, సంక్రాంతి మరియు సంక్రాంతి తర్వాత వచ్చేది కనుమ అని సంక్రాంతిని మూడు రోజులు చేసుకుంటారు.

భోగి పండుగ (Bhogi Festival)

సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగను భోగి అని పిలుస్తారు. ఈరోజున దైవ మరియు పితృకార్యాలు జరుపుతారు. అందుకే ఈరోజున అభ్యంగన స్నానాదికాలు నిషిద్దం. అందుకే భోగి ముందురోజే అభ్యంగన స్నానాదికాలు చేసుకొని నూతన వస్త్రాలు ధరించి విందువినోదాలు చేసుకుంటారు. భోగిరోజు భోగి మంటలను ఎండిన గొబ్బెమలతో చేసిన భోగి దండలతో వెలిగిస్తారు. చిన్న పిల్లలు భోగి పిడతల పేరుతో కళాత్మకంగా వివిధ రంగులతో అలంకరించి వాటిలో రేగి పళ్ళు, రాగి పైసలు వేసి తమ కావలసిన వారికి పంచుతారు.

సంక్రాంతి పండుగ (Makara Sankranti)

మూడు రోజుల పండుగలో రెండవ రోజు సంక్రాంతి అతి పవిత్రమైన రోజు. ఈరోజు వారి శక్తికి తగ్గట్టు బంగారం, వెండి, భూమి, గోవులు, ధాన్యం, బియ్యం, బట్టలు, పండ్లు లేద కూరగాయలు ధానం చేస్తారు. ఇలా చేయడం వల్ల గ్ర దోషాలు ఏమైన ఉటే అవి తొలగిపోయి ఆయురారోగ్యలతో మనశ్శాంతి లభిస్తుందని నమ్మకం. అందుకే ఈరోజు గందిరెద్దుల వారు, హరిదాసులు, బుట్ట బొమ్మలు అమ్ముకునే వారు, చెక్క భజనలు చేసే వారు, పగటి వేషగాల్లు ఇలా అనేక మందికి కానుకలు పైన చెప్పిన వాటిలో తమ శక్తికి తగ్గట్టు ధానం చేస్తారు. ఇలా చేయడం వల్లనే అనాదిగా వస్తున్న మన సంప్రదాయ కళలు ఇంక సజీవంగా ఉన్నాయి. సంక్రమణ పుణ్య కాలంలో పితృదేవతల తృప్తి కోసం స్నాన, దాన, శ్రాద్దాలు ఆచరిన్స్తారు.

కనుమ పండుగ (Kanuma Festival)

జాతర, సుర్య సంక్రమణం, గ్రహానం మొదలగునవి జరుపుకునే సంక్రాంతి మరుసటి రోజునే కనుమగా పిలుస్తారు. ఈరోజు మన పల్లె జీవనంలో మమేకమైన పశువులను పసుపు, కుంకుమలతో పూజించి, పూల మాలలు, కొత్త గంటలు, పూసల దండలతో అలంకరించి గోమాతను పూజించి, కృతజ్ణతలు తెలిపి ఆనందపడతారు. గోవులను ఎందుకు పూజిస్తారంటే రైతుల కుటుంబంలో అవి కూడ సభ్యులుగా కలిసిపోయాయి కాబట్టి. అవి రైతుల కుటుంబంలో సిరిసంపదలను సమకూరుస్తాయి కాబట్టి వాటిని పూజిస్తారు. అదేవిధంగా రైతులు తమ నాగళ్ళను, వ్యవసాయ పనిముట్లను కూడా పూజిస్తారు.

మూడు రోజుల సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారు? (How is the 3 Days Sankranti Festival Celebrated?)

సంక్రాంతి పండుగకు కూతుళ్ళను, అల్లుళ్ళను, కొత్త వియ్యాల వారిని ఇంటికి ఆహ్వానించి వారికి ఇష్టమైన వివిధ రకాల వంటకాలతో భోజనం పెట్టి, వాతి తాహతకు తగ్గ కానుకలతో సత్కరిస్తారు. అదేవిధంగా దైవ, పితృకార్యాలని అంత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేల వారి అభ్యున్నతికి మూలకారకాలైన పాడి పంటలకి కృతజ్ణతలు తెలిపే శుభ పండుగ సంక్రాంతి.

ముక్కనుమ (Mukkanuma Festival)

చాల ముచ్చటగా కుటుంబ సభ్యులతో మూడు రోజులు సంక్రాంతి జరుపుకున్నాక కొసరుగా నాల్గవ రోజు ఇంకొ పండుగ చేసుకుంటారు దాన్నే “ముక్కనుమ”గా పిలుస్తారు. ఈరోజు మహిళలు సావిత్రి గౌరీ దేవి వ్రతాన్ని మొదలుపెట్టి 9 రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజించి పదవ రోజు వాలలాడింపు పేరుతో గౌరిదేవిని జలంలో నిమజ్జనం చేస్తారు.

ఈవిధంగా తెలుగు వారి సంక్రాంతి పండుగను భోగి, సంక్రాంతి & కనుమ అనే పేర్లతో ముచ్చటగా మూడు రోజుల పండుగను కుటుంబ సభ్యులతో, గోవులతో, పకృతితో చేసుకుంటారు.

Related Posts

Bhogi Pallu Significance | బోగి పండ్ల పరమార్థం ఏమిటంటే.?

భోగాల పంట భోగి మంట | Bhogi Festival in Telugu

Makar Sankranti in Telugu | పుణ్యాల పండుగ – మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది?

జ్యోతిష్యశాస్త్రరీత్యా జీవన క్రాంతి సంక్రాంతి | Spiritual Significance of Makar Sankranti

Why Should we Worship Bulls on Sankranti in Telugu? | సంక్రాంతికి ఎదుల్ని ఎందుకు పూజించాలి?

https://hariome.com/kanuma-festival-2022/

సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?

Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య