Masik Durgashtami Vrat 2026 Dates | మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు వస్తుంది? విశిష్టత & పూజ విధానం ఏమిటి?!

0
3760
Masik Durgashtami Vrat
Masik Durgashtami Vrat 2025 Dates & Significance

Masik Durgashtami Vrat 2026

1మాస దుర్గాష్టమి వ్రతం 2026

మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు చేసుకుంటారు?! (Why is Masa Durgastami Performed Every Month?!)

దుర్గాష్టమి కేవలం నవరాత్రులలోనే కాదు, ప్రతి నెలా వస్తుంది. అవునండి ఇది నిజం దానినే మాసిక్ దుర్గాష్టమి అని పిలుస్తారు. పంచాంగం ప్రకారం మాసిక్ దుర్గాష్టమి ప్రతి నెల కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున జరుపుకుంటారు. అమ్మవారిని బ్రహ్మ, విష్ణు, శివుడు సృష్టించారు. సృష్టించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం భూమిపై చెడును వ్యాప్తి చేస్తున్న రాక్షశులను అంతం చేయడం. దుర్గదేవి శక్తి మరియు క్రోధానికి ప్రతిరూపం. భారతీయ హిందూ మతంలో దుర్గాదేవి అమ్మవారు చాలా శక్తివంతమైనది. అందుకే అమ్మవారికి అంకితభావంతో ప్రతి నెలా మాసిక్ దుర్గాష్టమి జరుపుకుంటారు.

మాస దుర్గాష్టమి యొక్క ప్రాముఖ్యత (Significance of Massik Durgastami):

మాసిక్ దుర్గాష్టమి వ్రతం పూర్వా జీవితంలో చేసిన చెడు కర్మలను తొలగించుకోవడానికి సహాయపడుతుంది. మాసిక్ దుర్గాష్టమి వ్రతాన్ని జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం దుర్గాదేవి అనుగ్రహంతో జీవితంలోని అన్ని కష్టాలు తొలగించడం. భక్తులు తమ జీవితాల్లో దైవిక రక్షణ, శ్రేయస్సు మరియు విజయం, శాంతిభద్రతల కోసం ఈ రోజున ఉపవాసం ఉంటారు.

మాస దుర్గాష్టమి రోజు అమ్మవారిని ఎలా పూజించాలి?! (How to Worship Goddess on Masik Durgashtami Day?!)

1. మాస దుర్గాష్టమి రోజున దుర్గా దేవి అమ్మవారి యొక్క మహాగౌరీ రూపానికి పూజలు చేస్తారు. దుర్గాదేవి అమ్మవారు రక్షణ మరియు చెడుపై విజయాన్ని సాధించే అత్యున్నతమైన మహశక్తి. మాసిక్ దుర్గాష్టమి జరుపుకోవడం వలన భక్తులు అందరూ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి జీవితంలో అనుకున్నది సాధించవచ్చని నమ్ముతారు.
2. దుర్గామాత యొక్క ఎనిమిది రూపాలను పూజిస్తారు. పూజ సమయంలో అమ్మవారికి ఖీర్ మరియు హల్వాను ప్రసాదంగా అందిస్తారు. హిందు సంప్రదాయంలో దుర్గాష్టమి పూజ రోజున ఆడపిల్లను పూజించే ఆచారం ఉంది.
3. జీవితంలోని వివిధ అంశాలలో అడ్డంకులు మరియు సవాళ్లను అధిగమించడంలో మరియు విజయాన్ని సాధించడానికి అమ్మవారు ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం.
4. ఆ రోజున దుర్గాదేవి చాలీసా, దుర్గాదేవి సప్తశతి, భగవత్ పురాణం మొదలైన వాటిని చదవడం మంచిది పురోహితులు చేపుతుంటారు. దుర్గాదేవి అమ్మవారు అనుగ్రహంతో భక్తుల కోరికలు నెరవేరుతాయి అని అంటారు.

అమ్మవారి గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయి (What Puranas Say About Goddess Durga Devi):

హిందు పురాణాల ప్రకారం, దుర్గా అమ్మవారిది బ్రహ్మ, విష్ణు మరియు శివుని ఉమ్మడి దైవిక మంత్రాల సృష్టి. శాంతిభద్రతలను అమలు చేయడానికి దుర్గాదేవి అమ్మవారిని సృష్టించారు. అమ్మవారు తన పది చేతులలో పది రకాల ఆయుధాలతో అత్యంత శక్తివంతమైన, అందమైన దేవతగా మరియు సింహా వాహనంగా అమ్మవారు అవతరించింది.

పురాణాల ప్రకారం, మహిషాసురుడు అనే రాక్షసుడు ఒకసారి దేవతల ను భయభ్రాంతులకు గురిచేస్తాడు.రాక్షసుడు ఇంద్రుడిని ఓడించినప్పుడు త్రిమూర్తులు దుర్గాదేవిని సృష్టించాలని నిర్ణయించుకున్నారు. దుర్గాష్టమి రోజున అమ్మవారు తన త్రిశూలంతో మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది.

మాస దుర్గాష్టమి రోజున పూజ చేయడం వలన కలిగే లాభాలు ఏంటి? (What Are the Benefits of Doing Puja on Masik Durgastami?):

1. దుష్ట శక్తులు అడ్డంకులను తొలగి వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు.
2. అందం, ఆరోగ్యం మరియు జ్ఞానం పెరగుతుంది.
3. జీవితంలో అన్ని సమస్యలు తొలగి కొత్త పనులు శుభారంభం మొదలవుతాయి.
4. జీవితంలో దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం పొంది ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగిస్తారు.
5. జ్ఞానం, సత్యం మరియు ఆధ్యాత్మిక స్వీయ-సాక్షాత్కారం వృద్ధి పెరగుతుంది.
6. అంతర్గత బలమైన కోరికలు నెరవేరుతాయి.
7. దుర్గాదేవి ఆశీస్సులు పొంది వారి జీవితంలో ఆనందం మరియు మనశ్శాంతితో ఉంటారు.
8. అన్ని రకాల ప్రతికూల శక్తులు, చెడు కళ్ళు, చేతబడి మరియు హానికరమైనటువంటివి మన దరికి చేరకుండా అమ్మవారు కాపాడుతారు.

మాస దుర్గాష్టమి 2026 తేదీలు & ముహూర్త సమయాలు (Masa Durgastami 2026 Dates & Muhurta Timings)

తేది వేడుక పేరు పక్షం తిథి ప్రారంభం తిథి ముగింపు
26-01-2026 (సోమ) మాసిక దుర్గాష్టమి శుక్ల పక్షం 25 జన, మధ్యాహ్నం 12:40
26 జన, ఉదయం 10:47
24-02-2026 (మంగళ) మాసిక దుర్గాష్టమి శుక్ల పక్షం 23 ఫిబ్ర, రాత్రి 08:31
24 ఫిబ్ర, సాయంత్రం 06:21
25-03-2026 (బుధ) మాసిక దుర్గాష్టమి శుక్ల పక్షం 25 మార్చి, ఉదయం 04:20
26 మార్చి, రాత్రి 02:18
24-04-2026 (శుక్ర) మాసిక దుర్గాష్టమి శుక్ల పక్షం 23 ఏప్రిల్, ఉదయం 11:19
24 ఏప్రిల్, ఉదయం 09:51
23-05-2026 (శని) అధిక మాసిక దుర్గాష్టమి శుక్ల పక్షం 22 మే, సాయంత్రం 07:34
23 మే, సాయంత్రం 06:57
22-06-2026 (సోమ) మాసిక దుర్గాష్టమి శుక్ల పక్షం 21 జూన్, ఉదయం 05:50
22 జూన్, ఉదయం 06:09
21-07-2026 (మంగళ) మాసిక దుర్గాష్టమి శుక్ల పక్షం 20 జూలై, సాయంత్రం 06:32
21 జూలై, సాయంత్రం 07:46
20-08-2026 (గురు) మాసిక దుర్గాష్టమి శుక్ల పక్షం 19 ఆగస్టు, ఉదయం 09:49
20 ఆగస్టు, ఉదయం 11:48
18-09-2026 (శుక్ర) మాసిక దుర్గాష్టమి శుక్ల పక్షం 18 సెప్టెంబర్, ఉదయం 03:30
19 సెప్టెంబర్, ఉదయం 05:56
18-10-2026 (ఆది) దుర్గాష్టమి / మాసిక దుర్గాష్టమి శుక్ల పక్షం 17 అక్టోబర్, రాత్రి 10:57
19 అక్టోబర్, రాత్రి 01:21
17-11-2026 (మంగళ) మాసిక దుర్గాష్టమి శుక్ల పక్షం 16 నవంబర్, సాయంత్రం 05:49
17 నవంబర్, సాయంత్రం 07:34
17-12-2026 (గురు) మాసిక దుర్గాష్టమి శుక్ల పక్షం 16 డిసెంబర్, మధ్యాహ్నం 12:15
17 డిసెంబర్, మధ్యాహ్నం 12:55
10-07-2026 (శుక్ర) యోగిని ఏకాదశి కృష్ణ పక్షం 10 జూలై, 08:16 11 జూలై, 05:22
25-07-2026 (శని) దేవశయని ఏకాదశి శుక్ల పక్షం 24 జూలై, 09:12 25 జూలై, 11:34
09-08-2026 (ఆది) కామికా ఏకాదశి కృష్ణ పక్షం 08 ఆగస్టు, 13:59 09 ఆగస్టు, 11:04
23-08-2026 (ఆది) శ్రవణ పుత్రద ఏకాదశి శుక్ల పక్షం 23 ఆగస్టు, 02:00 24 ఆగస్టు, 04:18
07-09-2026 (సోమ) అజా ఏకాదశి కృష్ణ పక్షం 06 సెప్టెంబర్, 19:29
07 సెప్టెంబర్, 17:03
22-09-2026 (మంగళ) పార్శ్వ ఏకాదశి శుక్ల పక్షం 21 సెప్టెంబర్, 20:00
22 సెప్టెంబర్, 21:43
06-10-2026 (మంగళ) ఇంద్రా ఏకాదశి కృష్ణ పక్షం 06 అక్టోబర్, 02:07
07 అక్టోబర్, 00:34
22-10-2026 (గురు) పాపాంకుష ఏకాదశి శుక్ల పక్షం 21 అక్టోబర్, 14:11
22 అక్టోబర్, 14:47
05-11-2026 (గురు) రామ ఏకాదశి కృష్ణ పక్షం 04 నవంబర్, 11:03
05 నవంబర్, 10:35
20-11-2026 (శుక్ర) దేవుత్తాన ఏకాదశి శుక్ల పక్షం 20 నవంబర్, 07:15
21 నవంబర్, 06:31
04-12-2026 (శుక్ర) ఉత్పన్న ఏకాదశి కృష్ణ పక్షం 03 డిసెంబర్, 23:03
04 డిసెంబర్, 23:44
20-12-2026 (ఆది) మోక్షద ఏకాదశి శుక్ల పక్షం 19 డిసెంబర్, 22:09
20 డిసెంబర్, 20:14

 

 

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Related Posts

Durgashtami in Telugu | దుర్గాష్టమి!

శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం) – Sri Durga Stotram (Arjuna Krutam) in Telugu

శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 2 – Sri Durga Ashttotara Satanamavali 2 in Telugu

శ్రీ దుర్గాష్టోత్తరశతనామస్తోత్రం – 1 – Sri Durga Ashtottara Shatanama Stotram 1 in Telugu

శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 1 – Sri Durga Ashtottara satanamavali 1

శ్రీ దుర్గాష్టోత్తర శతనామస్తోత్రం – Sri Durga Ashtottara Shatanama Stotram

శ్రీ దుర్గా స్తోత్రం – Sri Durga Stotram

శ్రీ దుర్గా పంచరత్నం – Sri Durga Pancharatnam

Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య