
Holy Hanuman Temples in India
1హనుమంతుని ప్రసిద్ధ దేవాలయాలు
శ్రీరాముని భక్తుడు హనుమంతుడు. హిందువులు హనుమంతుడిని కూడా రాముడిలాగే పూజిస్తారు. భారత దేశంలో హనుమాన్ గుడి లేదు అంటే అతిశయోక్తి కాదు. హనుమంతుని భక్తులు కోట్లలో ఉన్నారు. హనుమంతునికి అంకితం చేయబడిన అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. హనుమాన్ క్షేత్రాలకు వెళితే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయాలను తెలుసుకుందాం.
భారతదేశంలోని ప్రముఖ హనుమాన్ దేవాలయాలు (Top Hanuman Temples in India)
అంజనాద్రి కొండ హనుమాన్ ఆలయం (Anjanadri Hill Hanuman Temple):
హంపిలోని చూడదగిన ప్రదేశాలలో అంజనాద్రి కొండ ఒకటిగా చెబుతారు .చారిత్రక ప్రదేశం హంపికి సుమారు 5 కి.మీ ల దూరం. రామాయణంలో ప్రస్తావించబడిన వానర రాజ్యం కిష్కింధ ఉన్న ప్రదేశంగా అంజనాద్రి చెప్పబడినది. హనుమంతుడు ఈ ప్రదేశంలో జన్మించాడని నమ్ముతారు.
బడే హనుమాన్ మందిర్, ప్రయాగ్‌రాజ్ సంగం (Bade Hanuman Mandir, Prayagraj Sangam):
బడే హనుమాన్ జీ ఆలయం అనేది ప్రయాగ్‌రాజ్ కోటకు ఉత్తరాన 500 మీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక్క ప్రసిద్ధ మతపరమైన ప్రదేశం అని కూడా అంటారు. లేటె హనుమాన్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశంలో హనుమంతుడు శయన భంగిమలో భారీ విగ్రహాన్ని కలిగి ఉంటాడు. ఇది ప్రపంచంలోనే శయన భంగిమలో ఉన్న ఏకైక ఆలయంగా చెబుతారు.
శ్రీ సలాసర్ బాలాజీ ఆలయం, రాజస్థాన్ (Sri Salasar Balaji Temple, Rajasthan):
రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని సలాసర్ పట్టణంలో ఉన్న సలాసర్ బాలాజీ ఆలయం ఉంది. ఇది హనుమంతునికి అంకితం చేయబడిన ఆలయంగా చెబుతారు. ఈ ఆలయం పట్టణం మధ్యలో ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఏడాది పొడవునా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దానినీ సలాసర్ ధామ్ అని కూడా పిలుస్తారు. చైత్ర పూర్ణిమ మరియు అశ్విన్ పూర్ణిమ సమయంలో భక్తులతో కిటకిటలాడుతు ఉంటుంది. ఆ సమయంలో జరిగే జాతరలో భగవంతుని దర్శించుకోవడం కోసం భక్తులు దేశం నలుమూలల నుండి తరలివస్తారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఆరు నుంచి ఏడు లక్షలకు మించి ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌లోని శ్రీ హనుమాన్ గర్హి మందిరం (Shri Hanuman Garhi Mandir in Uttar Pradesh):
ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో హనుమాన్ గర్హి మందిరం ఉంది . అది ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయంగా చెప్పబడినది. ఇది అయోధ్యలో ఉన్న అత్యంత ప్రసిద్ధ మరియు పవిత్రమైన దేవాలయాలలో ఒకటిగా. ఈ దేవాలయం హనుమంతునికి అంకితం చేయబడింది. హనుమాన్ గర్హి ఆలయం కొండపై ఉంది. రామ జన్మభూమి ప్రదేశానికి 1.5 కి.మీ దూరంలో హనుమాన్ గర్హి మందిరం ఉంది. ఇది శ్రీరాముని జన్మస్థలం.
మహావీర హనుమాన్ మందిరం, బీహార్ (Mahavira Hanuman Temple, Bihar):
మహావీర హనుమాన్ మందిరం పాట్నాలో ఉంది. దేశంలో అత్యంత విశిష్టతమైన దేవాలయాలలో ఒకటిగా చెప్పబడినది. 1948లో ఈ ఆలయాన్ని నిర్మించారు. హనుమాన్ భక్తుల కోసం నిర్మించిన దేవాలయంగా చెబుతారు. లక్షలాది మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దర్శించుకునే దేవాలయాలలో ఇది రెండవది.
కాష్టభంజన హనుమాన్ మందిర్, సలాంగ్‌పూర్ (Kashtabhanjana Hanuman Mandir, Salangpur):
గుజరాత్‌లోని సలాంగ్‌పూర్‌లో ఉన్న శ్రీ హనుమాన్ మందిర్, సలాంగ్‌పూర్ హిందూ దేవాలయంగా చెబుతారు. ఈ దేవాలయం స్వామినారాయణ వడ్తాల్ సరిహద్దులోకి వస్తుంది. స్వామినారాయణ లేదా కృష్ణుడి విగ్రహాలు లేని ఏకైక స్వామినారాయణ ఆలయంగా చెబుతున్నారు.
శ్రీ అనువి ఆంజనేయ ఆలయం కోయంబత్తూరు, తమిళనాడు (Sri Anuvi Anjaneya Temple Coimbatore, Tamil Nadu):
శ్రీ అనువి ఆంజనేయ నందనవనం కోయంబత్తూరులోని ఒక చారిత్రక ప్రదేశంగ చెబుతారు. శ్రీ అనువి ఆంజనేయ నందనవనం “అనువావి”లో ఉంది. తమిళనాడులో శ్రీ అనువి ఆంజనేయ దివ్య ఆలయం కేరళకు వెళ్లే దారిలో కోయంబత్తూరులోని పెరియ తడగం వద్ద ఉంది. మురుగ దేవాలయం అనువావి కొండలలో ఉంది. ఈ మురుగ దేవాలయం శ్రీ అనువావి సుబ్రమణియర్ ఆలయం అని కూడా పిలుస్తారు.
ఝండేవాలన్ హనుమాన్ మందిర్, ఢిల్లీ (Jhandewalan Hanuman Mandir, Delhi):
ఢిల్లీలోని ఎక్కువ ప్రసిద్ధ దేవాలయాలలో ఝండేవాలన్‌లోని హనుమాన్ మందిర్ ఒకటి. హనుమంతుడి విగ్రహం 108 అడుగుల ఎత్తు ఉంది. ఈ ఆలయం ఢిల్లీలోని అనేక బాలీవుడ్ సినిమాలు మరియు సీరియల్స్‌లో కనిపిస్తుంది .
కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్, హైదరాబాద్, తెలంగాణ (Karmanghat Hanuman Temple, Hyderabad, Telangana):
భారతదేశంలోని తెలంగాణలోని హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఉన్నకర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం ఒక ప్రాముఖ్యమైన హిందూ దేవాలయంగా చెప్పవచ్చు. కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ ఆలయం హనుమంతునికి చెందినది. ఆ ఆలయం చరిత్ర, ఆలయం నిర్మాణ సౌందర్యం మరియు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం ప్రతి సంవత్సరం భక్తులలు తరలి వస్తారు మరియు పర్యాటకులకు చూడదగిన ఆలయంగా చెబుతారు.
జఖు దేవాలయం, సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ (Jakhu Temple, Shimla, Himachal Pradesh):
సిమ్లాలోని హిల్ స్టేషన్‌లోని ప్రధాన ఆకర్షణలలో జఖూ దేవాలయం భారతదేశంలోని ప్రాచీన మరియు ప్రసిద్ధ దేవాలయం. ఈ దేవాలయాన్ని “హనుమాన్ మందిర్” అంటారు. ఇది కోతుల దేవుడు హనుమంతునికి అంకితం చేయబడింది. రామాయణం కాలం నుండి ఉనికిలో ఉందని వారు నమ్ముతారు.
Related Posts
ముస్లిం దేశం అయిన UAEలో మొదటి హిందూ దేవాలయం ఇదే!? First Hindu Temple in UAE
https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/
శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha
https://hariome.com/ganesh-chaturthi-lord-vinayaka-has-special-grace-zodiac-signs/
దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గణపతిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi
వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu