పూరి జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాలు మరియు రథం వెనుక ఉన్న రహస్యలు మీకు తెలుసా? | Puri Jagannath Rath Yatra 2025

0
2691
Incomplete Idols of Lord Jagannath
Story Behind the Incomplete Idols of Lord Jagannath

What Is the Secret Behind the Incomplete Idols of Lord Jagannath & Special Feature of the Chariot

1జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాల వెనుక రహస్యం ఏమిటి & రథం యొక్క ప్రత్యేకత ఏమిటి?

జగన్నాథ రథయాత్రలో జగన్నాథుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహానికి చేతులు, కాళ్లు, గోళ్లు ఉండవు. అసలు జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాల వెనుక రహస్యం ఏమిటో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం, జగన్నాథ యాత్ర జూన్ 20న ప్రారంభమవుతుంది. రథయాత్రలో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు లక్షల్లో తరలి వస్తారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయ ఉన్నత అధికారులు. ఆషాఢ మాసం శుక్ల పక్షం నాడు జగన్నాథుడు, తన అన్న బలభద్రుడు మరియు సోదరి సుభద్రతో కలసి 9 రోజుల తీర్థయాత్రకు వెళ్తారు అని చెప్తారు.

జగన్నాథ రథయాత్ర కథ (Story of Puri Jagannath Rath Yatra)

జగన్నాథ రథయాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

జగన్నాథుడు, అన్న బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహానికి కాళ్లు, గోళ్లు లేవు అని చాలా మంది ఆశ్చర్యపోతారు. విశ్వకర్మ ఈ విగ్రహాన్ని తయారు చేశారు అని అంటారు. విగ్రహం తయారు చేసే ముందు విశ్వకర్మ ఒక షరతు పెట్టారు. ఈ 3 విగ్రహాలు పూర్తిగా తయరు అయ్యే వరకు ఎవరూ వారి గదిలోకి ప్రవేశించకూడదు అని చెపుతారు కాని రాజు గదికి తలుపు తెరిచినప్పుడు, విగ్రహాన్ని తయారు చేయడం మధ్యలో నిలిపివేశారు విశ్వకర్మ. ఆ రోజు నుండి ఈ 3 విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నాయి. విశేషమేమిటంటే ఈ 3 విగ్రహాలను వేప చెక్కతో తయారు చేశారు.

జగన్నాథ రథయాత్ర ఆషాఢం దశమి రోజున ముగుస్తుంది. సాధారణంగా దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో జగన్నాథ పాదయాత్ర జరుగుతుంది. రథయాత్రలో మొదటివాడు తాళ ధ్వజ రథంపై బలరాముడు ఉంటారు. జగన్నాథుని సోదరి సుభద్ర పద్మ ధ్వజ రథంపై మరియు జగన్నాథుడు గరుడ పతాకంపై ఉంటారు. రథం తయారు చేయడానికి మూడు రకాల పవిత్రమైన చెక్కలను ఉపయోగిస్తారు. దేవుని రథానికి 16 చక్రాలు ఉంటాయి.

పూరి జగన్నాథుని రథం కొలతలు (Dimensions of Puri Jagannath’s Chariot)

పూరీ జగన్నాథ రథం ఎత్తు – 45 చదరపు అడుగుల & వైశాల్యం – 35 చదరపు అడుగుల.
సోదరుడు బలరాముడు రథం – 65 అడుగుల పొడవు & మరియు 64 అడుగుల వెడల్పు – ఎత్తు 45 అడుగుల. బలభద్రుడు రథం సుభద్ర మరియు జగన్నాథుని కంటే చిన్నది.

సాయంత్రానికి ఈ 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయి. జగన్నాథుడు గుండిచా ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఉంది భక్తులు అందరికి దర్శనం ఇస్తారు.

Related Posts

https://hariome.com/puri-jagannath-rath-yatra-2023/

శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు? | Puri Jagannath Rath Yatra 2025

నేడు జగన్నాథుని రథయాత్ర | Puri Jagannath Rath Yatra in Telugu ?

Puri Jagannath Rath Yatra 2025 | పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతలు & ఆసక్తికరమైన నిజాలు

మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కలో ఈ మార్పులు గమనించారా? | Vastu Tips for Tulasi Basil

Lord Hanuman Vehicle | హనుమంతునికి ఒంటె వాహనంగా మారిన కథ?

శివుడు తన తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడు?! | Lord Shiva Secretes

శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?

దేవుడి దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి? దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి? | Why Sitting in the Temple After God Darshan

ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple

వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi