
శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
సప్తమోక్ష పురములలో ఒకటిగా, చార్-ధాంలో ప్రధానమైనదిగా చెప్పబడుతున్న పురుషోత్తమ క్షేత్రం ‘పురి’లో ఆషాఢ శుద్ధ విదియ నాడు సుభద్రా-బలభద్ర, సుదర్శన సహిత జగన్నాథ స్వామి వారి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది.
స్కాందపురాణాదులలో దీని మహిమ వివరించబడింది. ఈ యాత్రకు ఉత్సవమూర్తులు కాక ప్రధాన దారుమూర్తులే కదలి రావడం ఇక్కడి ప్రత్యేకం. ఈ యాత్ర పురీలోనే కాక చాలా నగరాలలో జరుగుతుంది కనుక ఆ యాత్రలలో పాల్గొనడం పుణ్యప్రదం. దారుమూర్తులుగా పురీలో కొలువై ఉన్నప్పటికీ జగన్నాథుడు కనుక మనం నివసించే ప్రదేశంలోనే జగన్నాథుని అనుగ్రహాన్ని ఆశించి విష్ణుపూజ, విష్ణుసహస్రనామ పారాయణ చేసినట్లైతే ఆ జగన్నాథుని అనుగ్రహాన్ని పొందవచ్చు.
“రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే”
రథములోనున్న జగన్నాథుని దర్శిస్తే పునర్జన్మ లేని మోక్షాన్ని పొందవచ్చన్నది శాస్త్రవాక్యం.
Related Posts
నేడు జగన్నాథుని రథయాత్ర | Puri Jagannath Rath Yatra in Telugu ?
https://hariome.com/puri-jagannath-rath-yatra-2023/
Puri Jagannath Rath Yatra 2025 | పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతలు & ఆసక్తికరమైన నిజాలు