
Hanuman Jayanti 2026
1హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? (When is Hanuman Jayanthi Celebrated?)
ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి చైత్ర మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున ఘనంగా జరుపుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో వేరే రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హనుమంతుడు శ్రీరాముని గొప్ప భక్తుడు. హనుమంతుడు బజరంగబలి, అంజనీ పుత్రుడు, మారుతి వంటి అనేక పేర్లతో భక్తులు ఆరాధిస్తారు. ఈ రోజున ఉపవాసం చేయడం మంచిది.
హనుమాన్ జయంతి సంవత్సరానికి 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు? (Why Hanuman Jayanti Celebrate 2 Times in a Year?)
తెలుగువారు చైత్ర పూర్ణిమ నుండి 41 రోజుల వరకు ఆంజనేయ స్వామి భక్తులు దీక్ష చేస్తారు తెలుగువారు 41 రోజుల తర్వాత అంటే ఆఖరి రోజు నాడు మళ్ళీ హనుమాన్ జయంతి ఘనంగా జరుపుతారు. ఒక జయంతి హనుమంతుని జన్మను సూచిస్తుంది, మరొకటి దుష్టశక్తులపై అతని విజయాన్ని సూచిస్తుంది.
హనుమాన్ జయంతి పూజ శుభ ముహుర్తాలు (Hanuman Jayanti Puja Shubh Muhurtas & Timings)
హనుమాన్ జయంతి, మంగళవారం, మే 12 , 2026
దశమి తిథి ప్రారంభం – మే 11, 2026న మధ్యాహ్నం 03:24 గంటలకు
దశమి తిథి సమాప్తం – మే 12, 2026న మధ్యాహ్నం 02:52 గంటలకు
హనుమాన్ జయంతి రోజు ఏమి చేయాలి? (What to Do on Hanuman Jayanti?)
1. హనుమాన్ జయంతి రోజున నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానమాచరించి హనుమంతుడిని పూజించడం మంచిది.
2. హనుమాన్ చాలీసా మంత్రాన్ని పఠించండి.
3. హనుమాన్ కి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజించడం మంచిది .
4. హనుమంతుడికి ఇష్టమైన పదార్థాలు తమలపాకులు, బేసన్ లడ్డు, మోతీచూర్ లడ్డు, జాంగ్రీ, కేసరి బాత్, తీపి రొట్టెలు, బెల్లం, శనగలు మొదలైనవి ప్రసాదాలగా సమర్పించండి.
5. ఉపవాసం చేయడం మంచిది. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించడం అని అర్థం.
6. సుందరకాండ, బజరంగ్ బాన్ సుందర్‌కాండ్, రామాయణ రామ్ రక్షా స్త్రోత్తం మరియు హనుమాన్ చాలీసా పఠించాలి.
7. కుదిరితే హనుమాన్ జయంతి రోజున ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేయాలి.
8. దేశీ నెయ్యి దీపం వెలిగించాలి.
9. హనుమాన్ జయంతి రోజున హనుమాంతుడి వెర్మిలియన్ రంగు లంకెను ధరించాలి.
10. ఇంటి పైకప్పుపై ఎర్ర జెండాను ఎగురవేయాలి.
ముఖ్య మనవి
హనుమాన్ జయంతి అని కాకుండా హనుమాన్ జన్మోత్సవం అని పిలుద్దాం ఎందుకంటే జయంతి అనే పదం లోకంలో లేని వారికి ఉపయోగిస్తారు. కాని హనుమాన్ జీ చిరంజీవి అనగా చావు లేని వాడు అని అర్ధం. హనుమాన్ ఇంక జీవించే ఉన్నారు. అందుకే హనుమాన్ జన్మోత్సవం అని పిలుద్దాం అని మేము కోరుకుంటున్నాము. ఈ మార్పును హనుమాన్ ఆశీస్సులతో ఈ రోజే మొదలుపెడదాం. ఈ సందేశాన్ని అందరికి తెలిసేల షేర్ చెయండి.
Related Posts:
Hanuman Jayanti 2026 | హనుమాన్ జన్మోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, శుభ ముహూర్తం మరియు పూజ విధి
తెలంగాణ అమర్నాథ్ యాత్ర గురుంచి మీకు తెలుసా?! 2023 జాతర తేదిలు ఖరారు
ఈ ఘాట్లో స్నానం చేస్తే బ్రహ్మ దోషంతో పాటు అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి! | Haridwar Neel-Ghat
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు | Powerful Mantras for Success in Exams
భద్రాచలంలో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం రహస్యాలు మీకు తెలుసా?!
Shlokas For Kids | పిల్లలకు సులభంగా నేర్పాల్సిన శ్లోకాలు, ఏమి నేర్పించాలి?
2025 Arunachalam Pournami Giri Pradakshina Dates | అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు








