Yogini Ekadashi Vratham 2025 in Telugu | సకల యోగ దాయకం యోగినీ ఏకాదశి వ్రతం

0
19786

Yogini Ekadashi Vratham 2023 Date in Telugu

Yogini Ekadashi Vratham in Telugu

1యోగినీ ఏకాదశి అంటే ఏమిటి? (What is Yogini Ekadashi?)

సంవత్సరకాలం లో హిందువులు పాటించే 24 ఏకాదశి వ్రతాలలో యోగినీ ఏకాదశి ఒకటి. జ్యేష్ఠ బహుళ ఏకాదశినాడు యోగినీ ఏకాదశిని ఆచరించాలి.

యోగినీ ఏకాదశి వ్రత మహిమ (Yogini Ekadashi Vrat Glory):

యోగినీ ఏకాదశినాడు ఉపవాసం చేసి ఆ శ్రీహరిని ధ్యానిస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి. 88000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు యోగినీ ఏకాదశి వ్రతం దీర్ఘకాలిక రోగాల బారినుండీ కాపాడుతుంది. చర్మ రోగాలను హరింపజేస్తుంది. యోగినీ ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్టిరునికి చెప్పినట్లుగా బ్రహ్మ వైవర్త పురాణం చెబుతున్నది.

యోగినీ ఏకాదశి వ్రత కథ (Yogini Ekadashi Vrat Story / Katha)

అలకాపురి నగరానికి అధిపతి అయిన కుబేరుని వద్ద ఎంతోమంది సేవకులు ఉండేవారు. వారిలో ఒకడు హేమమాలి అనే యక్షుడు. అతను ప్రతిరోజూ మానస సరోవరం వద్దకు వెళ్ళి అక్కడి కలువలను తెచ్చి శివపూజ వేళకు కుబేరునికి అందించాలి. అది అతని ఉద్యోగం. అతనికి స్వరూపవతి అనే సుందరితో వివాహం జరిగింది. కొత్తగా పెళ్ళైనందున హేమమాలి భార్యను విడిచి ఉండడానికి ఇష్టపడేవాడు కాదు.  కానీ ఉద్యోగ ధర్మం తప్పక నిర్వర్తించేవాడు.

ఒకనాడు సరోవరం నుంచీ పూలను తెస్తూ నేరుగా కుబేరుని వద్దకు వెళ్లకుండా హేమమాలి తన భార్య మీది విరహం తో ఇంటికి వెళ్ళాడు. మధ్యాహ్నం కావొచ్చినా పూలు తెచ్చే హేమమాలి రాకపోయే సరికి కుబేరుని శివపూజకు వేల మించిపోసాగింది. మరొక సేవకుని పిలిచి విషయమడుగగా అతను జరిగిన సంగతి కుబేరునితో విన్నవించాడు. కోపోద్రిక్తుడైన కుబేరుడు హేమమాలిని పిలిచి దూషించాడు. అంతేకాదు కుష్టురోగిగా భూలోకం లో జన్మించమని, భార్యకు దూరంగా శిక్షను అనుభవించమని శపించాడు.

హేమమాలి కుబేరుని శాపకారణంగా కుష్టువ్యాధిగ్రస్థుడై భూలోకం లో నానా యాతన పడ్డాడు. ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాడు. అలా సంచరించే క్రమం లో హిమాలయ పర్వత ప్రాంతం లో మార్కండేయ ఋషిని దర్శించాడు. దూరంగానే ఉంటూ ఆయనకు ఎన్నో సేవలు చేశాడు. అతని దుస్థితికి కారణమడిగి తెలుసుకున్న మార్కండేయుడు అతడిని యోగినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు.

యోగినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన హేమమాలి శాపవిముక్తుడై తిరిగి తన లోకాన్ని చేరుకుని, భార్యతో ఆనందంగా జీవించాడు.

ఈ వృత్తాంతాన్ని స్వయంగా శ్రీ కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు వివరించాడు.

యోగినీ ఏకాదశిని ఎలా ఆచరించాలి? (How to Celebrate Yogini Ekadashi?)

సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదికాలు ముగించుకుని విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఈ రోజున ఉపవసించడం ఎంతో ఉత్తమం. స్వామిని తులసి ఆకులతో పూజించాలి. దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించుకోవాలి. రోగులకు పండ్లను, దుప్పట్లను దానం చేయడం వలన కుటుంబం లోని దీర్ఘ కాలిక వ్యాధులు తొలగిపోతాయి. ఇంటిల్లిపాదీ ఆయురారోగ్యాలతో ఉంటారు. ఏకాదశినాడు జాగరణ చేసి, తెల్లవారి హరిపూజతో ఉపవాసాన్ని విరమించాలి.

Yogini Ekadashi 2025 Date And Time:

యోగిని ఏకాదశి, శనివారం, జూన్ 21, 2025

జూన్ 22న, పరానా సమయం – 13:37 నుండి 16:15 వరకు
పరానా రోజు హరి వాసర ముగింపు క్షణం – 09:41

ఏకాదశి తిథి ప్రారంభం – 07:18 జూన్ 21, 2025
ఏకాదశి తిథి ముగుస్తుంది – జూన్ 22, 2025న 04:27

యోగినీ ఏకాదశి ఉపవాసంలో తీసుకోవలసిన ఆహరం (Yogini Ekadashi Fasting Food)

  • నీల్లు
  • పాలు
  • పండ్లు
  • ఒక్క పూట భోజనం
  • శాఖాహారం

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

Related Posts

Vaikunta Ekadasi 2025 Telugu | వైకుంఠ ఏకాదశి తేదీ, పూజా విధానం & ఉపవాస నియమాలు

Nirjala Ekadashi 2023 Date & Puja Timings | Nirjala Ekadashi Importance

What do you Mean by Nirjala Ekadashi? | Date & Puja Timings

https://hariome.com/2023-festival-calendar/

Mohini Ekadashi 2023 in English | Mohini Ekadashi Date, Vrat Katha, Puja Vidhi

Amalaki Ekadashi 2025 | Amalaka Ekadashi in English

Amalaki Ekadashi 2025 | అమలక ఏకాదశి, విశిష్టత, ఏం చేయాలి, పూజా విధానం

Significance of Varuthini Ekadashi | Varudhini Ekadashi 2024

Mohini Ekadashi 2025 in Telugu | మోహినీ ఏకాదశి తేదీ, అర్థం, వ్రత కథ, ప్రాముఖ్యత

Varuthini Ekadashi 2025 Date | వరూధినీ ఏకాదశి, స్త్రీలు మాంగల్య బలాన్ని, పురుషులు ధన సంపదలనూ పొందటానికి పాటించవలసిన నియమములు ఏమిటి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here