
Worship Of God According To tithi
1వరాహ పురాణము
వరాహ పురాణం లో శ్రీ మహా విష్ణువు ఏ తిథినాడు ఏదేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్య ఫలం కలుగుతుందనే విశేషాల గురించి భూదేవి కి వివరించాడు.
ఏ తిథినాడు ఏ దేవుని పూజించాలి?
పాడ్యమి :- తిధులలోమొదటిదైన పాడ్యమి నాడు అగ్ని ని పూజించాలి.
విదియ : విదియ నాడు అశ్విని దేవతలను ఆరాధించాలి. అశ్వినీ దేవతలు విదియనాడు జన్మించారు. ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది.
తదియ : గౌరీ దేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియ నాడుజరిగినందు వల్ల, గౌరీ దేవికి ఆ తిధి అంటే ఇష్టం. తదియ నాడు గౌరీ కళ్యాణ కథ చదవడం వలన పెళ్లికాని కన్యలకు శీఘ్రవివాహం జరుగుతుంది. వివాహితలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది.
చవితి: వినాయకుడు పుట్టిన తిధి. వినాయక చవితి నాడేకాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు.
పంచమి: పంచమి నాడు నాగులు జన్మించాయి. నాగదోషాలు ఉన్నవారు ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి ఉపవాసం ఉండి, నాగ పూజచేస్తే నాగుల వల్ల భయం ఉండదు.
మిగిలిన తిథులు
షష్టి : కుమారస్వామి /సుబ్రహ్మణ్య స్వామి జన్మతిధి. షష్టినాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి బ్రహ్మచారికి భోజన తాంబూలాలను సమర్పించడం వలన సర్వకార్య విజయం,సంతాన యోగం కలుగుతాయి.
సప్తమి: సూర్యుని జన్మ తిధి. రధసప్తమి నాడే కాకుండా ప్రతీ శుద్ధసప్తమి నాడు సూర్యుడిని ఆరాదించి క్షీరానాన్ని నైవేద్యంగాపెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి.
అష్టమి: దుర్గాదేవి అష్టమాకృతులు ఆవిర్భవించిన తిధి. అష్టమినాడు దుర్గాదేవిని పూజించడం వలన శత్రుభయం ఉండదు.
నవమి: నవమినాడు సీతారాములని పూజించడం శ్రేష్టం. నవమి స్వామి జన్మతిథి. ఆరోజున దంపతి తాంబూలాన్ని ఇవ్వడం వలన అనుకూల దాంపత్యం చేకూరుతుంది.
దశమి: దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే పాపాలుతొలగుతాయి.
ఏకాదశి: కుబేరుడు పుట్టిన తిధి. ఈ తిధిన కుబేర పూజ చేస్తేఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది
ద్వాదశి: విష్ణువు కి ఇష్టమైన తిధి. ఈ తిధి రోజే విష్ణు మూర్తి,వామన రూపం లో జన్మించారు. ద్వాదశి నాడు ఆవునెయ్యి తో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఈ రోజున ఆంజనేయుని పూజించడం కూడా శుభకరం.
త్రయోదశి: ధర్ముడు పుట్టిన తిధి. ఈ రోజున ఇష్టదైవారాధన చేయాలి.
చతుర్దశి: రుద్రుని తిధి. ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే శుభప్రదం. కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. ఆ తిధిశివుడికి ప్రీతికరం.
అమావాస్య: పితృదేవతలకు ఇష్టమైన తిధి. అమావాస్యనాడు పితృదేవాతలకు తర్పణాలను ఇవ్వడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది.
పౌర్ణమి: పౌర్ణమికి చంద్రుడు అధిపతి. పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి కి చంద్రుడిని పూజించినచో ధన ధాన్యాది అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయి. మానసిక బాధలు తొలగుతాయి.
Related Posts
https://hariome.com/puri-jagannath-rath-yatra-2023/
శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు? | Puri Jagannath Rath Yatra 2025
నేడు జగన్నాథుని రథయాత్ర | Puri Jagannath Rath Yatra in Telugu ?
Puri Jagannath Rath Yatra 2025 | పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతలు & ఆసక్తికరమైన నిజాలు
మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కలో ఈ మార్పులు గమనించారా? | Vastu Tips for Tulasi Basil
శివుడు తన తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడు?! | Lord Shiva Secretes
శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?
ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple
వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi
Namaskaram
GOURI KALYANAM pdf kaani link kaani share chayagalaru