చెట్లను ఎందుకు పూజించాలి? | Why Should We Worship Tree in Telugu

0
6569
why-worship-the-trees
చెట్లను ఎందుకు పూజించాలి? | Why Should We Worship Tree in Telugu

why worship the trees

2. మొక్కలు వృక్షాల ప్రాముఖ్యత

మనిషి దైనందిన జీవితం మొక్కలూ, వృక్షాలపై ఆధారపడి వుంది. మనుగడకు అవసరమైన ఆహారం, ప్రాణవాయువు, వస్త్రాలు, వసతి, ఔషదాలు లాంటి ఎన్నో ప్రాణాధార వనరులు మనకు అవి అందిస్తున్నాయి. పరిసరాలకు అందాన్ని, మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.

నిస్వార్థంగా అవి జీవకోటికి ఎంతో సేవ చేస్తున్నాయి. నిర్జీవమైన తర్వాత కూడా అవి మనకు ఉపయోగపడతాయి.

భూమి మీద మనకన్నా ముందే వృక్ష, జంతు సమూహాలు ఏర్పడ్డాయి. కానీ మానవ వైఖరి వల్ల ఆ సమూహాలకు ఎంతో నష్టం కలుగుతోంది.

దీనికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ, మానవ సహజతీరును బట్టి చూస్తే అతను దేనికి అయితే విలువ ఇస్తాడో, వాటినే రక్షించేందుకు ప్రయత్నిస్తాడు.

మన పూర్వీకులు ఈ నైజం ఎరిగి ఉండటం వలననేమో చెట్లను పవిత్రంగా చూసుకోవాలని ఆ కాలం నుంచే బోధిస్తు వచ్చారు.

ఒక వేళ ఏదైనా కారణం వలన చెట్టుని కొట్టేయవలసి వస్తే తిరిగి పది చెట్లు నాటాలని భారతీయ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here