మనం చేసే పూజలు ఎందుకు ఫలించవు? | Why Some Worships Not Fruitful

0
25993
Why Some Worships Not Fruitful
Why Some Worships Not Fruitful

Why Some Worships Not Fruitful

1. మనం చేసే కొన్ని పూజలు ఎందుకు ఫలించవు?

మనం చేసే పూజలు కేవలం భగవంతుడినో అమ్మవారినో కరుణించమని వేడుకునే తంతులు కాదు. మానవ నేత్రాలతో చూడటానికి వీలు పడని శక్తులను పూజించి, సంతృప్తి పరచి, మనకు అనుకూలంగా ప్రేరేపించడం జరుగుతుంది.

ఆ శక్తులనే మన ఋషులు శక్తి స్వరూపాలైన దేవతలుగా, దేవుళ్లుగా మనకు తెలిపారు. లక్షణాన్ని బట్టి రూపాన్ని తెలియపరిచారు. త్రికరణ శుద్ధిగా చేసే పూజలు తప్పక ఫలిస్తాయి. ఎందుకంటే అది శాస్త్రం కాబట్టి.

పూజ అంటే ఏమిటి

పూజించడం , అర్చించడం భగవంతుని అనుగ్రహం కోసం చేసే ఉపచారాలు. మన ఋషులు వేల లక్షల సంవత్సరాలు శ్రమించి యోగాన్నీ, ధ్యానాన్నీ, తపస్సునీ తెలుసుకున్నారు.

వాటి సహాయం తో విశ్వాంతరాళం లోని ఎన్నో రహస్యాలను ఛేదించారు. ఏ శక్తిని ఎలా ప్రేరేపిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుని, సామాన్య మానవులకు కూడా అందేలా పూజా విధానాన్ని ఏర్పరిచారు.

శక్తిని నిక్షిప్తం చేసుకోగల మహత్తరమైన గుణం ఉన్నది కనుక పూజలలో ప్రధానంగా నీటిని ఉపయోగిస్తారు.

మన ఎదుట ఉన్న ప్రతిమలలోకి భగవంతుని ఆవాహన చేసి, షోడశోప చారాలతో పూజించి, మంత్రాలద్వారా శక్తిని మేల్కొలుపుతారు.

చుట్టూ ఉన్న దుష్ట శక్తులను పారద్రోలి దైవికమైన శక్తిని ప్రసరింప జేస్తారు. ఆ దైవిక శక్తులే మనల్ని వెన్నంటి కాపాడి పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చి సకల శుభాలనూ కలుగ జేస్తాయి.

అంతే కాదు మంత్రాలు ఉచ్చరించడం, వినడం వల్ల శరీరం లో అనేక రుగ్మతలు తొలగుతాయి.

మానసిక వికాసం కలుగుతుంది. ఏకాగ్రత, జ్ఞానం పెరిగి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పూజా విధానం లో ఇంత శాస్త్రం ఉంది.

మొక్కు బడిగా పెట్టే నమస్కారాలూ, కొట్టే కొబ్బరికాయలూ పూజలు కావు. 

పూజ ఎన్ని రకాలు?

సత్వ, రజస్, తమో గుణాలనే త్రిగుణాలకి అనుకూలంగా సాత్విక ఆరాధనలనూ, రజోగుణ ప్రధానమైన యజ్ఞ యాగాది క్రతువులనూ, తమో గుణ ప్రధానమైన ఆరాధనకు తంత్ర శాస్త్రాన్నీ మన ఋషులు ఏర్పరిచారు. వీటిలో ఒక్కో విధానం లో ఎన్నో రకాల శాఖలు ఉన్నాయి.

మంత్రం లోని మహత్తు ఏమిటి?

మనం ఉచ్చరించే అక్షరాలు తరంగాలై అనుకూల శక్తులను ప్రేరేపించడం కోసం మంత్రాలను ఏర్పరిచారు. అంతే తప్ప భగవంతునికి సంస్కృతం తప్ప మరో భాష రాదనికాదు.

మంత్రం అత్యంత శక్తివంతమైనది. ఓంకార నాదం మన శరీరం ల పరిసరాలలో చూపే అద్భుతమైన ప్రభావాలగురించి ప్రపంచమంతా అంగీకరించింది.

ఇక సంస్కృత భాష గొప్పదనం అంతర్జాతీయ స్థాయిలో ఒప్పుకోబడ్డది. కానీ భారత దేశం లో మాత్రం చాలా చోట్ల సంస్కృతాన్ని మృత భాషగా పేర్కొనడం మన అజ్ఞానానికి పరాకాష్ట.

పూజలు ఫలించక పోవడానికి కారణం

కళ్లెదుట భగవంతుని రూపాన్ని ఆధారంగా, ఊతంగా  చేసుకుని ఆద్యంత రహితుడైన స్వామిని ఆవాహన చేసి, సర్వస్య శరణాగతి తో ఆరాధించడమే పూజ అంటే.

భగవంతుని తత్వాన్ని మరిచి,  పటాలకు పూజ చేయడం వల్ల ప్రయోజనం కలుగదు. మనసా, వాచా, కర్మణా భగవంతుని ఆరాధిస్తే మట్టి ముద్ద లో కూడా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.

Related Stories

Necessary of Rituals | జరిగేది మార్చలేనప్పుడు పూజలు, వ్రతాలు చేయడం ఎందుకు?

గర్భిణీ స్త్రీలు పూజలు చేయవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది | Pregnant Women Perform Puja

కార్తీక పౌర్ణమి నాడు ఇలా పూజలు చేస్తే అంతా శుభమే కలుగుతుంది | Kartika Punnami Puja/Rituals

సర్పదోష నివారణ పూజలు ఎక్కడ చేస్తారు ? | Where to Perform Sarpa Dosa Nivarana Pooja Telugu

పూజలు చేస్తే జాతకం లో దోషాలు పోతాయా ? | Can pooja avoid dosha in our life

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here