విద్య అంటే సరైన జ్ఞానం. మన చుట్టూ ఉన్న మాయను పటాపంచలు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహా విద్య. జ్ఞాన స్వరూపిణి అయిన శక్తి ధరించిన పది రూపాలే దశ మహా విద్యలు. తంత్ర శాస్త్రం లో శక్తి ఉపాసనను విద్య అంటారు. తోడల తంత్రం లో దశమహా విద్యల సాధన ఉంటుంది.
అజ్ఞానం పాపానికి కారణమౌతుంది. పాపం దుఃఖానికి కారణం. జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది. పరమానందాన్ని కలిగిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారు పది అవతారాలలో ప్రసాదిస్తుంది. ఆ అవతారాలనే దశ మహా విద్యలన్నారు. జ్ఞానానికి పది అవతారాలు ఎందుకు? మహా విద్య పది రూపాలను ఎందుకు సంతరించుకుంది?