
What Should We see After Wake up in Morning?
1. నిద్రలేవగానే మనం చూసేవి… రోజంతా ప్రభావం చూపుతాయి!
ప్రతి ఉదయం ఒక కొత్త ఆశ, కొత్త అవకాశం. మన రోజు ఎలా సాగుతుంది అన్నది… నిద్రలేవగానే మనం చూడే దృశ్యంపై బాగా ఆధారపడి ఉంటుంది. ఉదయం కళ్లు తెరిచి మనసుకు ఆనందాన్ని ఇచ్చే దృశ్యం కనపడితే, ఆ రోజంతా ఉత్సాహంగా, శాంతియుతంగా గడుస్తుంది. మన పని కూడా చక్కగా జరిగిపోతుంది. అప్పుడు మనకు తడుముకోకుండా ‘‘ఏమి ముఖం చూశామో కానీ, అన్నీ బాగా జరిగిపోతున్నాయి’’ అనే అనుభూతి కలుగుతుంది.
అలాగే, ఒకవేళ నిద్రలేవగానే మనసును బాధించే దృశ్యం కనపడితే… ఆ ఉదయం నుంచే మనకు అనవసరమైన ఆందోళన మొదలవుతుంది. ఆ రోజంతా చికాకుగా గడుస్తుంది. మన పూర్వికులు అందుకే నిద్రలేవగానే దైవ దర్శనం లేదా శుభప్రదమైన దృశ్యం చూడమన్నారు.
నిద్ర లేవగానే ఏమి చూడాలి?
నిద్ర మెలకువ రాగానే…
-
మొదటగా ప్రశాంతంగా దీర్ఘ శ్వాస తీసుకోవాలి.
-
తర్వాత రెండు అరచేతులనూ ముఖంపై ఉంచి, నెమ్మదిగా వాటివైపు చూసుకుంటూ ఈ శ్లోకాన్ని పఠించాలి:
శ్లోకం:
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ
కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం
ఈ శ్లోకంలోని భావం —
అరచేతి ముంత భాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీ దేవి, చివర భాగంలో గోవిందుడు నివసిస్తున్నారు. కాబట్టి ఉదయం మెలకువ వచ్చిన వెంటనే మన చేతులు దర్శించుకోవాలి — అనే దివ్య సూత్రం ఉంది.
ఇందులో శాస్త్ర విజ్ఞానం కూడా ఉంది. ఉదయం నిద్రలేవగానే మన శరీరంలో ఎనర్జీ ఫ్లో మెరుగుగా ఉంటుంది. ఆ సమయంలో మన చేతుల దృష్టి ద్వారా మనసు శాంతించేది. తర్వాత భగవంతుని రూపాన్ని చూసి రోజును ప్రారంభిస్తే, ఆరోజంతా శుభప్రదంగా గడుస్తుంది.
Related Posts
వాస్తు ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాలు/పటాలు ఏ దిక్కున ఉండాలి? | Direction of God Idols/images
Lord Shiva | శివుడి దగ్గర ఉన్న నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం వెనుక పరమార్థం ఏమిటి?
Kashi Yatra | కాశి వెళ్లే వారు తొమ్మిది రోజులుండి ఆ రోజుల్లో ఏం చేయాలి & ఏమి చూడాలి?