
Vinayaka Shanti Snanam To Get Rid of Your Sins
4వినాయక శాంతి స్నానం విధానం (Vinayaka Shanti Snanam Procedure)
మొదటి కుండలోని నీటిని పోస్తూ బ్రాహ్మణులు ఈ క్రింది శ్లోకాన్ని పారాయణం చేస్తూ స్నానం చేయించాలి.
సహస్రాక్షం శతధారమృషిభిః పావనం స్మృతం |
తేన త్వామభిషించామి పావమాన్యః పునంతుతే |
రెండవ కుండలోని నీటిని ఆ వ్యక్తి తలపై పోస్తూ బ్రాహ్మణులు ఈ క్రింది శ్లోకాన్ని పారాయణం చేస్తూ స్నానం చేయించాలి.
భగంతే వరుణోరాజా భగం సూర్యో బృహస్పతిః ||
భగమింద్రశ్చవాయుశ్చ భగం సప్తర్షయో దదుః ।
మూడవ కుండలోని నీటిని ఆ వ్యక్తి నభిషేకిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పారాయణం చేయాలి.
యత్తే కేశేషు దౌర్భాగ్యం సీమంతే యచ్చ మూర్ధని ॥
లలాటే కర్ణయోరక్షో రాపస్తద్రఘ్నంతు తే సదా !
తరువాత నాలుగవ కుండలో నీటిని పోస్తూ పై మూడు శ్లోకాలు పారాయణం చేయాలి. ఎడమ చేతిలో కుశ దర్భలను తీసుకొని ఆ వ్యక్తి యొక్క తలను స్పృశిస్తూ మేడి కర్ర నుండి చేసిన స్రువ తో ఆవనూనెను కుడి చేతితో తీసుకొని ఈ ఆహుతులను ఈ క్రింది మంత్రాలు పారాయణం చేస్తూ అగ్నిలో ఆహుతులను సమర్పించాలి.
మితాయ స్వాహా, సమ్మితాయ స్వాహా, శాలాయ స్వాహా, కటంకటాయ స్వాహా, కూష్మాండాయ స్వాహా, రాజపుత్రాయ స్వాహా.
అలా చేసిన తరువాత బియ్యంతో అన్నాన్ని లౌకిక అగ్నిలో వంటి, తరువాత చారు ని తయారు చేసి దానిని ఇంతకు ముందు చెప్పిన ఆరు స్వాహా మంత్రాలతో ఆ లౌకికాగ్నిలోనే హవనం చేసి మిగిలిన దానిని ఇంద్రాగ్నియమాది దేవతలకు బలుల కింద సమర్పించాలి. ఆపై ఒక అరుగుపై దర్భలను పరచి, దానిపై పుష్ప, గంధ, ఉండేరకమాల, పక్వాన్న, పాయసాలు, నేయి కలిపిన పులావు, ముల్లంగి గడ్డి, అప్పాలు, పెరుగు, బెల్లం ఉండలు, లడ్డు మరియు చెఱకుముక్కలు ఈ ద్రవ్యాలన్నిటినీ సమర్పించాలి.
తరువాత బ్రాహ్మణులను భోజనాలతో తృప్తి పరచాలి. గురువుగారికి రెండు వస్త్రాలనిచ్చి అన్యగ్రహాలను పూజించి మరల సూర్యార్చన చేయాలి. వినాయకున్ని, గ్రహాలను ఈ విధంగా పూజించే వ్యక్తులు సర్వ కార్యాల్లోనూ మంచి జరుగుతుంది పండితులు చెబుతున్నారు.
Related Posts
Lord Shiva Worship | శివయ్య దర్శన సమయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి.
ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules
https://hariome.com/srisailam-temple-durga-navratri-dasara-celebrations/
https://hariome.com/2-eclipses-in-october-solar-lunar-eclipses-impact-navratri/
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi