
Utpanna Ekadashi 2025
1ఉత్పన్న ఏకాదశి 2025
మన హిందు మతంలో ఉత్పన్న ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని ఉత్పత్తి ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున,మహావిష్ణువుకు భక్తులు ఉపవాసం ఉండి, మహావిష్ణువుకు ప్రార్థనలు,పూజలు చేస్తారు. ఈ ఏకాదశి మార్గశీర్ష మాసంలో కృష్ణ పక్షంలో 11వ రోజున జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్య వస్తుంది. ఈ సంవత్సరం 2025 నవంబర్ 15 శనివారం నాడు వచ్చింది.
ఉత్పన్న ఏకాదశి కథ (Utpanna Ekadashi Story):
మురాసురుడు అనే ఒక రాక్షసుడు తన రాక్షతత్వం ప్రజల్లో భయాందోళనలు సృష్టించేవాడు. ఆ రాక్షసుని చూసి దేవతలు భయభ్రాంతులకు గురయ్యారు. అప్పుడు వారు అందరూ మహావిష్ణువు సహాయం కోరారు. అప్పుడు మహావిష్ణువు ఆ రాక్షసుడితో వందల సంవత్సరాలు యుద్ధం చేసారు. అప్పుడు మహవిష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి గుహలోకి వెళ్లి అక్కడ కొంత సమయం నిద్రిస్తారు. ఆ గుహ యొక్క పేరు హిమవతి. అప్పుడు ఆ రాక్షసుడు మహా విష్ణువును చంపడానికి ఆ గుహలోకి ప్రవేశిస్తాడు. మహావిష్ణువు నిద్రిస్తున్న సమయంలో, ఒక అందమైన శక్తి కలిగిన స్త్రీ ఈ రాక్షసుడి ముందుకు వస్తుంది. అప్పుడు ఆ స్త్రీ కొంత సమయం అతనితో యుద్ధం చేసి అతన్ని చంపుతుంది. అప్పుడు మహావిష్ణువు నిద్ర మేల్కొని చూస్తే రాక్షసుడిని చంపడం చూసిన మహావిష్ణువు సంతోషించి ఆమెను తనలో భాగం చేసుకుని ఆమెకు ఉత్పన్న ఏకాదశి అని పేరు పెట్టాడు. ఆ రోజు నుంచి, ఈరోజు వరకు ఉత్పన్న ఏకాదశిగా మన హిందువులు జరుపుకుంటారు.
ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత (Utpanna Ekadashi Significance):
ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనం శ్రీ కృష్ణుడు, రాజు యుధిష్ఠిర వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ రూపంలో మరియు ‘భవిష్యోత్తర పురాణం’ వంటి హిందూ గ్రంథాలలో వివరించడం జరిగింది. ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ‘సంక్రాంతి’ పవిత్రమైన రోజులలో విరాళాలు ఇవ్వడం అలాగే ప్రముఖ తీర్థయాత్రలలో పవిత్ర స్నానాలు ఆచరించడం వంటిది. ఈ ఏకాదశిని చేసేవారు వారి పాపాల నుండి విముక్తి కలిగి చివరకు మోక్షాన్ని పొందుతారని భావిస్తారు. మరణించిన తరువాత వారిని విష్ణుమూర్తి నివాసమైన ‘వైకుంఠానికి’ తీసుకువెళతారు అని నమ్మకం. వెయ్యి గోవులను దాన చేయడం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఎక్కువ అని భక్తులు నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశి రోజున చేసే ఉపవాసం ప్రధాన దేవతలు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్‌లకు ఉపవాసంతో సమానంగా భావిస్తారు.
ఉత్పన్న ఏకాదశి 2025 తిథి సమయాలు (Utpanna Ekadashi 2025 Dates & Muhurt):
ఉత్పన్న ఏకాదశి , నవంబర్ 15, 2025 శనివారం
పరణ సమయం : నవంబర్ 16, 01:16 PM – 03:27 PM
హరి వాసర ముగింపు ముహూర్తం: నవంబర్ 16, 09:10 AM
ద్వాదశి ముగింపు ముహూర్తం: నవంబర్ 17, 04:48 A
ఉత్పన్న ఏకాదశి పూజ విధానం (Utpanna Ekadashi Puja Vidh) :
1. ఆ రోజున భక్తులు ఉదయాన్నే పవిత్ర స్నానం ఆచరించి, వస్త్రాలను ధరించాలి
2.భక్తులు శ్రీ యంత్రం తో పాటు విష్ణువు విగ్రహాన్ని ఉంచాలి, నెయ్యితో దీపాన్ని వెలిగించాలి, పువ్వులు లేదా దండలు మరియు స్వీట్లు సమర్పించాలి
3.భక్తులు తులసి పత్రంతో పాటు పంచామృతాలు మహావిష్ణువుకు సమర్పించాలి.
4.తులసి పత్రాన్ని సమర్పించకపొతే, ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.
5.ఆ రోజు ప్రదోష సమయంలో పూజ చేయాలి మరియు మహావిష్ణువుకు భోగ్ ప్రసాదం అందించాలి. అలాగే విష్ణు సహస్రనామం, శ్రీ హరి స్తోత్రం పఠించాలి.
6.సాయంత్రం పూజ తరువాత హారతి చేసి తర్వాత, అందరికీ భోగ్ ప్రసాదాన్ని పంచిపెట్టాలి.
7.ప్రసాదం పంచి పెట్టిన తర్వాత, భక్తులు ఉపవాసాన్ని విరమించుకోవాలి.
8.చాలా మంది పారణ సమయంలో ద్వాదశి తిథి నాడు తమ ఉపవాసాన్ని విరమించుకోవాలని కఠినమైన ఉపవాసం పాటిస్తారు.
9.మహావిష్ణువు, కృష్ణుడు అనుగ్రహం పొందేందుకు భక్తులు తప్పనిసరిగా ఆలయాన్ని సందర్శించాలి.
10.ఆ రోజు సాయంత్రం పూట తులసి కోట ముందు దీపం వెలిగించాలి.
ఉత్పన్న ఏకాదశి రోజు పఠించాల్సిన మంత్రం (A Mantra to be Recited on the Day of Utpanna Ekadashi):
ఓం నమో భగవతే వాసుదేవయే నమః..!!
అచ్యుతం కేశ్వం కృష్ణ దామోదరం, రామ్ నారాయణం జాంకీ వల్లభం..!!
శ్రీ కృష్ణ గోవింద్ హరే మురారి, హే నాథ్ నారాయణ్ వాసుదేవ..!!
హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..!!
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Spiritual Posts
Matsya Dwadashi 2025 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ
కార్తీక పౌర్ణమి నాడు ఇలా పూజలు చేస్తే అంతా శుభమే కలుగుతుంది | Kartika Punnami Puja/Rituals
కార్తీక మాసంలో ఉదయం లేవగానే ఏం చూడాలి? ఏం చూడకూడదు? | Kartika Masam Rules to Follow
చనిపోయిన వారిని కొన్ని నిమిషాల పాటు బ్రతికించే దేవాలయం | Lakhamandal Temple History
అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date