
త్యాగరాయ ఆరాధన విశేషాలు | Tyagaraya Aradhana in Telugu
1. త్యాగరాజ స్వామి
కర్ణాటక సంగీతానికి ఉనికిని ప్రసాదించిన సంగీత త్రిమూర్తుల్లో ఒకరు కాకర్ల త్యాగబ్రహ్మం. గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ తామరాకు మీది నీటిబొట్టులా ఆ మొహాలెవీ అంటకుండా భాగవదారాధన చేయగలగడం సాధారణ వ్యక్తులకు సాధ్యమయ్యే విషయం కాదు. కటిక దరిద్రం లో ఉన్నప్పుడు కూడా వాకిలి వరకూ వచ్చిన రాజాహ్వానాన్ని “నిధి చాలా సుఖమా..రాముని సన్నిధి సేవ సుఖమా..?” అని తిరిగి పంపిన నిర్మోహ భక్తి ఆయనది. సరస్వతీ స్తన ద్వయమైన సంగీత సాహిత్యాలు రెండిటినీ నిష్కళంక భక్తి తో కొలిచిన మహాయోగి, వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి.