మొటిమల నివారణకు కొన్ని చిట్కాలు | Tips to Prevent Pimples in Telugu

1
9517
tips-to-prevent-pimples
మొటిమల నివారణకు కొన్ని చిట్కాలు | Tips to Prevent Pimples in Telugu

మొటిమల నివారణకు కొన్ని చిట్కాలు | Tips to Prevent Pimples in Telugu

గుప్పెడు వేపాకులను పౌడర్ చేసి , అందులో రెండు చెంచాలా రోజ్ వాటర్ మిక్స్ చేసి చిక్కటిపేస్ట్ లా చేసి, మొటిమల మీద నేరుగా అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు మాయం అవుతాయి . అంతే కాదు మొటమలతో వచ్చిన మచ్చలను కూడా మాయం చేస్తాయి.

కస్తూరి పసుపు , నిమ్మకాయల రసంలో అరగదీసి రాసిన మొటిమలు తగ్గుతాయి .

మంజిష్ట తేనెతో అరగదీసి పూస్తే పోతాయి .

 చందనం , జాజికాయ , మిరియాలు నూరి పూస్తే పొతాయి.

గేదే వెన్నను మొటిమలపైన పూయు చున్న పొతాయి.

* రక్తచందనం , పచ్చి పసుపు , గేదే పాలతో నూరి పూస్తే మొటిమలు పొతాయి.

* శొంటి , లవంగాలు, బాగుగా నూరి పట్టిస్తే మొటిమలు పొతాయి.

వెల్లుల్లి రసం మొటిమల పైన రాస్తే తగ్గుతాయి .

బియ్యం కడిగిన నీళ్ళు ముఖానికి రాస్తూ 10 నిమిషాలు అయిన తరువాత కడుగుచుండిన మొటిమలు పొతాయి.

* పచ్చపెసల పిండి , హారతి కర్పూరం , సుగంధి పాల వీటిని సమబాగాలుగా కలిపి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని ప్రతి రాత్రి ముఖానికి రాస్తూ ఉంటే మొటిమలు , మచ్చలు పోయి ముఖానికి మంచి కాంతి , సౌందర్యం పెరుగుతాయి.

* 50 గ్రా వాముతో , 40 గ్రా పెరుగు కలిపి మెత్తటి పేస్ట్ లాగా నూరి రాత్రి పూట ఫేస్ పేస్ట్ లా నూరి రాత్రి పూట ముఖానికి అవసరం అయినంత వరకు ప్యాక్ లా వేసుకుంటూ ఉంటే మొటిమలు పూర్తిగా నివారించ బడుతాయి.

* అతివస , శ్రీగంధం సమబాగాలుగా తీసి , ఆవుపాలతో నూరి 7 రోజులు ముఖానికి పూసిన మొటిమలు హరించును.

* తులసి ఆకు రసం, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించిన మొటిమలు పోవును .

తులసిఆకులు , పుదినా , వేపాకు మెత్తగా నూరి ముఖానికి పుసిన మొటిమలు హరించును.

బాదంపాలు లేక రసం పుసిన మొటిమలు పోవును .

బొప్పాయి కాయ రసం రాస్తే మొటిమలు హరించును. కడిగితే జిడ్డు పొతుంది.

ప్రతిరోజు పడుకునే ముందు పుదిన రసం రాసి అరగంట తరువాత కడిగిన తగ్గును .

పోకచేక్కతో గంధం తీసి రాసిన మొటిమలు పోవును .

చిక్కుడు ఆకుల రసం పుసిన ముఖము పైన అన్ని మచ్చలు పోవును .

వేడినీళ్ళతో నిమ్మరసం పిండి టీస్పూన్ గ్లిసరిన్ కలిపి పట్టించి అరగంట తరువాత కడిగిన పోవును

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here