
అర్జునుడిని ఓడించినవాడు
3. ఆ వ్యక్తి అర్జునుని ఎందుకు చంపాలనుకున్నాడు?
అర్జునుడు తేరుకుని ‘ అర్జునుని ఎందుకు చంపాలని అనుకుంటున్నావు? అతను నీపట్ల చేసిన దోషం ఏమిటి?’ అని అడుగగా అతను ఇలా సమాధానమిచ్చాడు. ‘ఆ అర్జునుడికి తానే అందరికన్నా గొప్ప కృష్ణ భక్తుడని గర్వం. ఎంత పొగరు అతనికి’ అన్నాడు. ‘అతనేం చేశాడు? వివరంగా చెప్పండి. అన్నాడు అర్జునుడు.’ ఎదుట ఉన్నది అర్జునుడే అని తెలియని ఆ వ్యక్తి ఇలా చెప్పాడు. ‘ సర్వలోక పాలకుడైన మా గోపాలుని, అతి సుకుమారుడైన మా కన్నయ్యని భక్తి పేరున మభ్యపెట్టి, ఆయన చేత రథం నడిపించుకుంటాడా ? మా ప్రాణాలకు ప్రాణమైన శ్రీకృష్ణుని సారధిని చేశాడా ఆ గర్విష్టి అర్జునుడు. ఎంతటి పాపి అతడు..! అందుకే మా కృష్ణయ్యను అంత కష్టపెట్టిన అర్జునుని ఖండ ఖండాలుగా నరికి చంపేస్తాను. అతనికోసమే వెతుకుతున్నాను.’ అన్నాడు.
ఇది విన్న అర్జునుడికి తానే శ్రీ కృష్ణుని భక్తులలో అగ్రగణ్యుడిననే గర్వం సమసిపోయింది. ఆ వ్యక్తికి భక్తిగా నమస్కరించి అక్కడినుండీ నిష్క్రమించాడు.