
చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu
చెమట పట్టడం ప్రతివారికి సర్వసాధారణం. మనుషుల ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి చెమట గ్రంథులు ఉపయోగపడతాయి.
శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి ఇవి ఉపకరిస్తాయి. ఒంటినిండా చెమట గ్రంథులు మనుషులకు ఉంటాయి.
5. జనరలైజ్‌డ్ హైపర్ హిడరోసిస్‌కి కారణాలు
చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. అందువల్ల ఈ కాలంలో చెమట పట్టడం తక్కువ. వేసవిలో అంటే మార్చి నెల నుంచి వేడి మొదలవుతుంది.
అప్పుడు చెమట పట్టడం ప్రారంభమవుతుంది. వేడి పెరిగే కొద్దీ చెమట కూడా ఎక్కువ అవుతుంటుంది. ఇది దాదాపు అందరిలోనూ ఉంటుంది. ఇవే కాక…
వ్యాయామం చేసిన తరవాత చెమటలు ఎక్కువ వైరల్ ఫీవర్, మలేరియా జ్వరాల్లో శరీరం ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. చెమటలు పట్టాక శరీరం చల్లగా అయిపోతుంది.
గుండెకు సంబంధించిన వ్యాధులు అంటే షాక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సందర్భాల్లోనూ చెమటలు పడతాయి.
ఎండోక్రైన్ లేదా హార్మోనల్ డిజార్డర్స్ అంటే హైపర్ పిట్యుటరిజమ్, హైపర్ థైరాయిడిజమ్, మధుమేహం వంటి వ్యాధుల్లోనూ చెమటలు ఎక్కువ. లింఫోమా, కార్సినాయిడ్ సిండ్రోమ్ వంటి క్యాన్సర్లు,స్థూలకాయం, గర్భిణీలలో, మెనోపాజ్ దగ్గర పడిన వారిలో…
మద్యం ఎక్కువగా తాగినప్పుడు , పార్కిన్‌సన్స్ వ్యాధి, వెన్నెముక దెబ్బతినడం వంటి న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు. ఫ్లూయాక్సిటిన్ వంటి మందులు వాడినప్పుడు .