
ఐకమత్యమే మహా బలం అని మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు చదువుకున్నాం. ఐకమత్యం తో ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళని ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటాం . అలాగే ఐకమత్యంతో ప్రాణాలను కాపాడుకున్న పక్షుల కథ తెలుసుకుందాం. చిన్నప్పటి పుస్తకాలతో పాటు మనం మర్చిపోయిన నీతి కథలను మరోసారి గుర్తుచేసుకుందాం.
2. వేటగాని పథకం పనిచేసిందా?
ఆ సమీపం లో తన తోటి పావురాలతో కలిసి చిత్రగ్రీవుడనే పావురాల రాజు తిరుగుతూ ఉన్నాడు. అక్కడ తిండి గింజలను చూసి ‘అందరూ పదండి, మనకు తిండి గింజలు దొరికాయి’ అన్నాడు.
అప్పుడు ఆ గుంపులో ఒక తెలివైన పావురం ‘ నట్టడవిలో బియ్యం ఎక్కడినుంచీ వస్తాయి.? నాకేదో అనుమానంగా ఉంది ఇది ఏదో కుట్రలా ఉంది.
మనం అక్కడికి వెళితే ప్రమాదమేమో’ అంది. అప్పుడు పావురాల రాజు చిత్రగ్రీవుడు వారించాడు. ‘ అలాంటిదేమీలేదు. ఎవరో వన విహారానికి వచ్చి ఇక్కడ తిండిగింజలను పడేసుకుని వెళ్ళి ఉంటారు.
అనవసరంగా భయపడవద్దు పదండి అని అన్నాడు.’ రాజుమాటకు ఎదురు చెప్పలేక పావురాలన్నీ ఆ తిండి గింజలమీద వాలాయి.