
Moral of the Story of Dhruva
3. ధృవునికి జరిగిన పరాభవం (Crash of Pole)
ఒకనాడు ధృవుడు తన తండ్రి దగ్గర ఆడుకోవాలని ఆశపడ్డాడు. ఆయన తన చిన్నాభార్య అయిన సురుచి కుమారుడు ఉత్తముడిని ఆనందంగా ఆడిస్తూ ఉన్నాడు.
ప్రేమగా తండ్రి దగ్గరకు వెళ్ళిన చిన్నారి ధృవుని ఆయన పట్టించుకోలేదు. తానూ తండ్రి తొడపై కూర్చుంటానని అడిగిన ధృవుని అతని పినతల్లి వారించి ‘ ఆ స్థానం నా కుమారుడికి మాత్రమే దక్కుతుంది.
మహారాజుతో పాటు కూర్చోడానికి నీకు అర్హత లేదు’ అని కటువుగా అంది. ఆమాటలకు నొచ్చుకున్న ధృవుడు తన తల్లి పడుతున్న పరాభవాన్ని గుర్తుచేసుకుని ‘ ఈ సింహాసనాన్ని అధిష్టించే అర్హత పొందేవరకూ ఈ గడపతొక్కను’ అని శపథం చేశాడు.
తన తల్లితో సహా ఆ రాజభవంతిని విడిచిపెట్టాడు.
Promoted Content