
1. ధృవ తార
ధృవ నక్షత్రం. పేరువింటే తెలియని ఒక శక్తి కలుగుతుంది. ఎంత నిరాశలో ఉన్నవారికైనా మళ్ళీ కొత్త ఉత్సాహం పుంజుకుంటుంది.
మిన్నువిరిగి మీదపడ్డా లక్ష్యం వైపుగా పయనించే స్ఫూర్తి కలుగుతుంది. సప్తర్షి మండలం సైతం ధ్రువతార చుట్టూ తిరుగుతుంది.
అంతటి మహిమాన్వితమైన , స్ఫూర్తివంతమైన ధృవ నక్షత్రం కథ ఏమిటి? తెలుసుకుందాం.