గురు రాఘవేంద్రుని స్మరిద్దాం..! | Sri Guru Raghavendra Story in Telugu

0
13120
గురు రాఘవేంద్రుని స్మరిద్దాం..! | Sri Guru Raghavendra Story in Telugu
Sri Guru Raghavendra Story in Telugu

Sri Guru Raghavendra Story in Telugu

2. రాఘవేంద్రస్వామి జననం-జీవితం

రాఘవేంద్ర స్వామివారు 1595లో తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు మరియు గోపికాంబ అనే కన్నడ బ్రాహ్మణ దంపతులకి  రెండవ సంతానంగా జన్మించారు. వేంకటేశ్వర స్వామి కృపతో జన్మించాడని ఆయనకు వేంకటనాథుడనే పేరు పెట్టారు. కుంభకోణం లోని శ్రీపీఠం లో విద్యార్థిగా వేదవేదాంగాలను ఆభ్యసించారు. విద్యాభ్యాసం ముగించుకుని భువనగిరి చేరుకున్నారు. తరువాత సరస్వతీబాయిని వివాహం చేసుకున్నారు. వారిరువురికీ లక్ష్మీ నారాయణాచార్య అనే కుమారుడు జన్మించాడు. కుమారుడు జన్మించిన తరువాత కుటుంబం తో సహా ఆయన కుంభకోణానికి చేరుకున్నారు.  శ్రీమఠంలో  సుధీంద్రతీర్థుల వద్ద శిష్యరికం చేశారు. కొంతకాలానికి సన్యసించి వెంకటనాథుడు రాఘవేంద్రుడయ్యాడు. విద్యలో అసమానమైన ప్రతిభను కనబరచి ఎన్నో వాదోపవదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత మరియు వైదికశాస్త్రాల్లో నిష్ణాతుడై ఎంతోమందికి విద్యాదానం చేశారు. రాఘవేంద్ర స్వామివారు గొప్ప సంగీత విద్వాంసులు. ఆయన గొప్ప వైణికుడు కూడా..సుధీంద్ర తీర్థుల తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణభారతదేశమంతా విజయం యాత్రలు చేశారు. మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతాన్ని ఈయన ప్రచారం చేసారు. 1671 లో తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి పొందారు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here