
Shyamala Navaratri 2025
శ్యామల నవరాత్రులు
2025 మాఘ శ్యామల నవరాత్రులు జనవరి 30 నుండి ఫిబ్రవరి 7 వరకు జరుగుతాయి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు, అంటే ఈ పూజను గోప్యంగా జరపడం విశేషం. ఈ శ్యామల నవరాత్రులలో ప్రతిరోజూ దేవతను ప్రత్యేక అలంకారంలో పూజిస్తారు. పూజా విధానాలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
నవరాత్రుల వివరణ
ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు జరుగుతాయి:
- మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు
- ఆశ్వయుజమాసంలో శారదా నవరాత్రులు
- ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు
- చైత్రమాసంలో వసంత నవరాత్రులు
గుప్త నవరాత్రుల ప్రత్యేకత:
గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజల లాగా కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు. ఈ పూజలో దుర్గమ్మను తొమ్మిది రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో వీటిని శ్యామల నవరాత్రులు అని పిలుస్తారు.
శ్యామల నవరాత్రుల ప్రాముఖ్యత
శ్యామలాదేవిని భక్తితో పూజిస్తే:
- ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది.
- ఐశ్వర్యం లభిస్తుంది.
- పెళ్లికాని వారికి వివాహం జరుగుతుంది.
- పురాణ ప్రామాణికత
- పూర్వం బండాసురుని వధించేందుకు ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది. ఆమె బ్రహ్మాది
- దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమించారు. అందుకే శ్యామలాదేవిని మంత్రిణి దేవి లేదా మాతంగి అని పిలుస్తారు.
శ్యామల నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు, ఇవి ఈసారి 2025 జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరుపుకుంటారు. ఈ సమయంలో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు.
తేదీలు, తిథులు, పూజా విధానాలు:
రోజు | తేదీ | తిథి | అమ్మవారి రూపం | పూజా విధానం |
1వ రోజు | 2025 జనవరి 30, గురువారం | మాఘ శుద్ధ పాడ్యమి | లఘు శ్యామల (Laghu Shyamala) | కుంకుమార్చన, దుర్గా స్తోత్రాలు |
2వ రోజు | 2025 జనవరి 31, శుక్రవారం | మాఘ శుద్ధ విదియా | వాగ్వాధినీ శ్యామల (Vagvadini Shyamala) | భక్తి స్తోత్రాలు, మంగళ హారతి |
3వ రోజు | 2025 ఫిబ్రవరి 1, శనివారం | మాఘ శుద్ధ తదియా | నకుల శ్యామల (Nakuli Shyamala) | అర్చన, ప్రత్యేక ప్రసాదం |
4వ రోజు | 2025 ఫిబ్రవరి 2, ఆదివారం | మాఘ శుద్ధ చవితి | హాసంతి శ్యామల (Hasanti Shyamala) | నైవేద్యం, స్తోత్ర పారాయణం |
5వ రోజు | 2025 ఫిబ్రవరి 3, సోమవారం | మాఘ శుద్ధ పంచమి | సర్వసిద్ధి మాతంగి (Sarvasiddhi Matangi) | లక్ష్మీ పూజ, శక్తి స్తోత్రాలు |
6వ రోజు | 2025 ఫిబ్రవరి 4, మంగళవారం | మాఘ శుద్ధ షష్ఠి | వాస్య మాతంగి (Vasya Matangi) | దీపాలు, పుష్పాలతో అర్చన |
7వ రోజు | 2025 ఫిబ్రవరి 5, బుధవారం | మాఘ శుద్ధ సప్తమి | సారిక శ్యామల (Sarika Shyamala) | మంత్రాలతో పూజ, కుంకుమార్చన |
8వ రోజు | 2025 ఫిబ్రవరి 6, గురువారం | మాఘ శుద్ధ అష్టమి | శుక శ్యామల (Suka Shyamala) | పాయస నైవేద్యం, స్తోత్రాలు |
9వ రోజు | 2025 ఫిబ్రవరి 7, శుక్రవారం | మాఘ శుద్ధ నవమి | రాజ మాతంగి / రాజ శ్యామల (Raja Shyamala) | మహా పూజ, నవరాత్రి ముగింపు కార్యక్రమం |
పూజా విధానం:
అలంకరణ: ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించాలి.
నైవేద్యం: పాయసాన్ని ప్రసాదంగా సమర్పించాలి.
వస్త్రాలు: పూజ చేసేవారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం.
పారాయణం: మాతంగి స్తోత్రాలు, షోడశోపచార నామాలు, హృదయ కవచం, అష్టోత్తర శతనామavali చదవాలి.
నిత్య కుంకుమార్చన నిర్వహించాలి.
ఈ విధంగా భక్తితో, నిష్టతో శ్యామల నవరాత్రులు జరిపితే సకల శుభాలు లభిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి.
Related Posts:
Ratha Saptami 2025 Date & Time | రథసప్తమి విశిష్టత, పూజ విధానం & ముఖ్య నియమములు
Vasant Panchami 2025 | వసంత పంచమి, శ్రీ పంచమి | Basant Panchami
Masa Shivaratri 2025 Dates | Masik Shivaratri | మాస శివరాత్రి ఎందుకు, ఎలా జరుపుకోవాలి?
Skanda Sashti 2025 | స్కంద షష్టి! పూజా విధానం ఏమిటి? ఎలా జరుపుకోవాలి?