Shravana Masam 2025 | శ్రావణ మాసం అంటే ఏమిటి? వచ్చే పండుగలు? ఈ మాసంలో ఏ దేవుళ్ళను పూజించాలి? ఎందుకు?

0
655
Shravana Masam
What are the Shravana Masam Puja, Rituals, Vrat and Festivals?

Shravana Masam 2025

1శ్రావణ మాసం ఆ పేరు ఏలా వచ్చింది? (How Did the Month of Shravana Get It’s Name?)

మన హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం 5వ నెల. ఇది ఆషాడ మాసం తర్వాత వస్తుంది. ఈ మాసంలో పౌర్ణమి రోజున శ్రావణ నక్షత్రం పాలించే నక్షత్రం కాబట్టి అందువలన శ్రావణ మాసం అని పేరు పెట్టారు. శ్రావణ నక్షత్రం ఆ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం. పురాణ శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అని మన పురోహితులు చెబుతున్నారు. సాధారణంగా ఆషాఢ మాసం అయిపోయిన వెంటనే శ్రావణ మాసం వస్తుంది.

ఈ మాసంలో తిథి, వార, నక్షత్ర మరియు గ్రహాల స్థానము వల్ల అనేక శుభ యాదృఛ్ఛికాలు జరుగుతున్నాయి. సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన అందువలన దక్షిణాయనం కూడా ప్రారంభమైంది. 6 మసాలా పాటు దక్షిణాయనం ఉంటుంది.పురుషోత్తమ(అధిక మాసం) మాసం ముగిసిన తర్వాత శుద్ధ శ్రావణం ఉంటుంది. ఈ అత్యంత స్వచ్ఛమైన శ్రావణ మాసంలో వివిధ రకాల పండుగలు మరియు వ్రతాలు జరుపుకుంటారు.

శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు మరియు వ్రతాలు (Important Festivals & Vrat During the Shravana Masam):

ఈ శ్రావణ మాసాన్ని ఉపవాసాలు మరియు పండుగల మాసంగా అంటారు. ఈ శ్రావణలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. చెరువులు, నదులు నిండిపొతాయి. శివయ్యను పూజించడానికి శ్రావణ మాసం అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ మాసాన సోమవారం రోజున పరమ శివునికి పూజ చేయడం వలన ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు.

శివారాధన (Shiva Puja):

పూర్వం దేవతలు సముద్ర మథనాన్ని శ్రావణ మాసంలో ప్రారంభించారు. ఈ సమయంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు విషం బయటకు వచ్చింది. ఆది సృష్టి నాశనానికి దోహదపడుతుందని గ్రహించిన దేవతలు పరమ శివుడిని ప్రార్థించగా పరమ శివుడు గౌరీదేవిని చూస్తాడు. గౌరీదేవి పరమ శివునితో ఈ దేవతలు అందరూ మన సంతానం వారిని రక్షించుట మన బాధ్యత అని పరమ శివున్ని ఆ గరళాన్ని స్వీకరించాలని కోరెను.

పరమ శివుడు శ్రావణమాసంలో విషాన్ని గరళమునందు ఉంచుకోని లోకాన్ని రక్షించెను. అందుకుగాను శ్రావణ మాసంలో సోమవారాలు భారతీయ హిందువులు అందరూ భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసమంతా ఆ పరమేశ్వరుని కొలిచేదరు.

భక్తులు ఎవరైతే శ్రావణ సోమవారాలు పరమ శివుని ఆరాధన చేసి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి పరమ శివుని అనుగ్రహం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు.

శ్రావణ మాసంలో శివ పూజలు (Lord Shiva Rituals in Shravana Masam)

పరమ శివుని అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో ఈ ఆచారాలు పాటించాలి పండితులు చెబుతున్నారు.

1. ప్రతిరోజూ ఉదయం లేవగానే తల స్నానం చేసి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయాలి.
2. పరమ శివుని దర్శనం చేసుకోవాలి.
3. బిల్వ పత్రాన్ని ఆ శివునికి సమర్పిచాలి అలాగే మహా మృత్యుంజయ మంత్రం, లింగాష్టకం మరియు శివ నామస్మరణ జపించాలి.
4. ఆ రోజు ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేయాలి.

శ్రావణ మంగళవారం (Shravana Mangalavaaram)

గౌరి అమ్మవారి మాంగల్యబలంతో పరమ శివుడు ఈ పని చేసాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. కుజ దోషం, కాలసర్ప దోషం పరియు రాహుకేతు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దోషం తొలగిపోతుంది పంచాంగకర్తలు చెప్తునారు. నూతన వధువు వివాహం జరిగిన తొలి 5 సంవత్సరాల ఈ వ్రతాన్ని ఆచరించాలి. నూతన వదువరులను ఇంటికి పిలిచి పూజలు చేసి ఆ తర్వాత రాత్రి మేల్కొలుపు నిర్వహిస్తారు. మంగళగౌరీ వ్రతం గురించి నారదమహర్షి సావిత్రీదేవికి చెప్పినట్లు మరియు శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉంది.

శ్రావణ మాస బుధ & గురువారాల్లో ? (Shravana Budhavaaram & Guruvaaram)

ఈ మాసంలో ప్రతి బుధవారం, గురువారం రోజున బుధుడు అలాగే గురుడు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మహావిష్ణువును కూడా పూజించడం విశేషం. విష్ణు సహస్రనామం, పారాయణ వంటివి చేస్తారో వారికి మంచి జరుగుతుందని విష్ణుపురాణంలో ఉన్నది. పాండురంగ విఠలుడను కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. సంపద, తెలివితేటలు మరియు విద్య పెరగాలని కోరుకునేవారు ఈ వ్రతాన్ని చేస్తారు.

శ్రావణ శుక్రవారం (Shravana Shukravaaram):

శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తారు. అష్ట లక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములు పూజించినట్లే అని మన హిందూ పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తులు వారి జీవితంలో దుక్కాలు, కష్టాలు నుండి నుంచి బయటకు రావడానికి వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తారని వేద పండితులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడం మంచిది అంటారు. శ్రావణ మాసం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని యొక్క ఆశీస్సులు పొందేందుకు అనుకూల సమయం అని భక్తులు నమ్ముతారు. ఆ రోజున అమ్మవారికి పూజలు చేయడం వల్ల సంతాన సౌభాగ్యం కలుగుతుందని పండితులు చెబుతారు.

శ్రావణ శనివారం (Shravana Shanivaaram):

శ్రావణ మాసంలో శనివారం రోజున విష్ణువు ప్రతి రూపమైన రావి చెట్టు ని పూజ చేస్తారు. గోడలపై ఉన్న నరసింహ స్వామి అవతారానికి ఉంచి పూజ చేస్తారు. ప్రహ్లాదుని కోసం నరసింహ అవతారం ఎత్తాడు దేవుడు. అప్పుడు ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమవుతాడు. దానికి ప్రతీకగా స్తంభం లేదా గోడపై స్వామి వారి చిత్రానికి పూజలు చేస్తారు.

శ్రావణ ఆదివారం (Shravana Aadivaaram)

శ్రావణ మాసంలో మొదటి ఆదివారం రోజున స్త్రీలు ఆదిత్య రాణుబాయి వ్రతాన్ని చేస్తారు. సూర్యుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఆ రోజున ఉపవాస దీక్ష ఆచరిస్తారు. ఆదివారం రోజున సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు.

Navaratri Related Posts

పద్మిని ఏకాదశి | వ్రతం, విశిష్ఠత, పరిహారాలు | Padmini Ekadashi

నాగుల చవితి ప్రతి సంవత్సం వచ్చే తేదిలో మార్పులు ఎందుకు? విశిష్టత? పూజ విధానం & కావాల్సిన సామగ్రి | Nag Panchami 2023

Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం

విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు | Vijayawada Dasara Navaratri Utsavalu 2024

శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

https://hariome.com/how-to-cook-payasam-to-offer-goddess/

శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu

దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?

దసరా పండుగ నిర్ణయం ఎలా చేస్తారు? పండుగ జరుపుకునే విధానం ఏమిటి ? | How to Celebrate Dussehra Festival ?

Durgashtami in Telugu | దుర్గాష్టమి!