
విజేతలు చెబుతున్న విజయ రహస్యాలు..! | Secrets Tips of Winners in Telugu
జీవితం లో విజయం సాధించాలని కోరుకొని వారెవరు? కానీ ప్రతిసారీ ఓటమి పాలవుతూ కొత్త మార్గాలు వెతుక్కుంటాం. నిజానికి గెలుపు మన చేతుల్లోనే ఉంది. మనిషి తలుచుకుంటే ఏదీ ఎప్పటికీ అసాధ్యం కాదు. ‘ఒక చేపను కొండలెక్కమంటే ఎంత ప్రయత్నించినా చేయలేదు కదా. అలాగే మనకు కూడా హద్దులున్నాయ్’ అనే మాటలు వినకండి. ఎందుకంటే మనిషి చేపలా ఈద గలడు, పక్షిలా ఎగర గలడు, చెట్లను కూడా ఎక్కగలడు. స్వతహాగా సహజ సిద్ధంగా మనిషికి అపరిమితమైన శక్తులున్నాయి. మనకు పరికరాల తోడు ఉంది, పరిజ్ఞానం ఉంది. ఇంకా దేనికోసం ఆగుతున్నాం..? సాధించాలనుకోవడమే విజయానికి హద్దు.
2. సూర్యుడు ఉదయించే ముందే నిద్రలేవాలి
ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే విషయం ఇది. కానీ ప్రపంచాన్ని శాసించిన విజేతలందరూ పాటించిన మొదటి సూత్రం ఇది. ఉద్యోగాల పనివేళలు రాత్రి పూట ఉంటే సూర్యోదయాన్నే లేవడం. కుదరదు అప్పుడు అందుకు తగిన నిద్రనూ ఆహారాన్నీ తీసుకోవాలి. కానీ ఉదయించే సూర్యుని లేలేత కిరణాలు శరీరాన్ని తాకేలా ఒక్క అయిదు నిముషాలు ఉన్నా అది ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యమైన పనులు కష్టమైన పనులు ఉదయాన్నే చేసుకోవడం వల్ల పనులు చురుగ్గానూ రాత్రి చేసే పనికన్నా మెరుగ్గానూ జరుగుతాయి.