సకల కళ్యాణ కారకం భువన మోహన రూపం | Story of Gopala Sundari in Telugu

0
2659

 

సకల కళ్యాణ కారకం భువన మోహన రూపం
సకల కళ్యాణ కారకం భువన మోహన రూపం | Story of Gopala Sundari in Telugu

గోపాలసుందరీ దేవి ఎవరు..?Story of Gopala Sundari

శ్రీవిద్యా స్వరూపమైన గోపాలుని రూపమే గోపాల సుందరి. ఆమెనే మదన గోపాల సుందరీ అనీ, శ్రీ విద్యా రాజగోపాల అనీ అంటారు. ఈ రూపం లో సకల సిద్ధిదాత్రి శ్రీవిద్యానూ, జగత్కల్యాణ కారకుడైన శ్రీకృష్ణునీ ఒకే సారి పూజించవచ్చు.

శ్రీ కృష్ణుడి పరమ భక్తుడైన లీలా శుకుడు రచించిన కృష్ణ కర్ణామృతం లో గోపాల సుందరీ ధ్యానం కనబడుతుంది. లీలా శుకుని ధ్యానం లో దర్శనమిచ్చిన అద్భుతరూపమే శ్రీ గోపాలసుందరీ దివ్యమంగళ మూర్తి.

Back

1. అమ్మవారి రూపం ఎలా ఉంటుంది?

కృష్ణుని రూపం అంకుశ చక్రాలనూ చెరుకు విల్లునూ బంగారు వేణువునూ నెమలి పింఛాన్నీ ధరించి ఉండగా,అమ్మవారి భాగం శంఖాన్నీ, తామర పువ్వునూ, పుష్పా గుచ్చాన్నీ ధరించి ఉంటుంది.

శ్రీవిద్యా రాజగోపాల సుందరీ దేవి జగన్మోహన రూపాన్ని ఎంత చూసినా తనివితీరదు అనడం అతిశయోక్తి కాదు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here