
Benefits Of Eating Fried Chickpeas With Jaggery
2ఆరోగ్య ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యానికి మేలు: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ రెండు పదార్థాలు కీలక పాత్ర పోషిస్తాయి. శనగల్లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.
అలసటకు గుడ్‌బై: రోజంతా అలసిపోయి, నీరసంగా ఉండేవారా? వేయించిన శనగలు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందించి, అలసటను దూరం చేస్తుంది.
మధుమేహ వ్యాధి నియంత్రణ: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ ఆహారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శనగల్లో ఉండే పీచు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బెల్లం శరీరానికి తాత్కాలిక శక్తిని అందిస్తుంది.
కండరాల బలానికి: కండరాల బలాన్ని పెంచడంలో ఈ రెండు పదార్థాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. శనగల్లో ఉండే ప్రోటీన్ కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. బెల్లం కండరాలకు శక్తిని అందిస్తుంది.
బరువు తగ్గడానికి సహాయం: బెల్లం, శనగలు రెండూ బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బెల్లంలో ఉండే పీచు పొట్ట నిండుగా ఉంచుతుంది. ఫలితంగా ఎక్కువ సేపు ఆకలి వేయదు.
పోషకాల గుడి: బెల్లం, వేయించిన శనగల్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల సహాయంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది: బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఐరన్ లోపం నివారణ: వేయించిన శనగాల్లో పుష్కలంగా ఇనుము ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచి, రక్తహీనతను నివారిస్తుంది.
మెదడు పనితీరు మెరుగుదల: వేయించిన శనగలు, బెల్లం రెండింటిలోనూ ఎక్కువ మొత్తంలో బి విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు నరాల సంబంధ సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.
చిట్కా: ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ వేయించిన శనగలు, చిన్న ముక్క బెల్లం కలిపి తినడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.