అసలు దసరా పండుగను జరుపుకోవడములో గల వాస్తవ ఆంతర్యము ఏమిటి? | Reasons Behind Celebrating Dasara in Telugu

1
10060
reason-behind-celebrating-dasara-hariome
Reasons Behind Celebrating Dasara in Telugu

The Story of Vijaya Dashami

1విజయదశమిని ఎందుకు జరుపుకుంటారు. 

మన పూర్వీకులు మనకు ఏ సాంప్రదాయాన్ని అందించినా కూడా అందులో ఎంతో అర్ధము, పరమార్ధము ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అయితే ఆయా సాంప్రదాయాల గురించి మనకు అవగాహన కల్పించి మనలను తగిన విధముగా ముందుకు నడిపించి దారి చూయించే గురువులు రోజురోజుకూ కనుమరుగవుతున్నారు. అటువంటి విషయాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం హరి ఓం చేస్తుంది.

విజయదశమిని జరుపుకోవడానికి వాడకంలో ఉన్న పురాణా గాధ

మనుషులు గత జన్మ కర్మ ఫలితముగా వ్యాధి రూపేణా, ఋణ రూపేణా, శత్రు రూపేణా భాధపడుతూ ఉంటారనేది శాస్త్రము చెబుతుంది. ఆ విధముగా కర్మ జీవులైన మానవులు జన్మను తీసుకున్నాక గత జన్మ రుగ్మతలను మరచి తిరిగి మరలా మరలా పాపాలు చేస్తూ ఉంటారు. ఆయా పాప కర్మలను అనుసరించి వారిని తగిన విధముగా అనారోగ్యపరంగానో, శత్రు రూపములోనో, లేక మృత్యురూపంలోనో సమస్యలను సృష్టించి శిక్షించడానికి ఆయా సమయములలో యమ ధర్మరాజు ఉపక్రమించడము జరుగుతుంది.

ఈ విధంగా జీవులను తగిన విధంగా శిక్షించడానికి ఉపక్రమించిన యమ ధర్మరాజుకి

  1. ఒకవైపు కోర (దంతము) శరదృతువు లో అశ్వియుజ శుద్ద పాడ్యమి తిధి నుండి నవమి వరకు గల సమయములో బయటకు రావడము జరుగుతుంది.
  2. రెండవ కోర చైత్ర మాసం ప్రారంభములో ఉన్న 9 రోజులలో వస్తుందని శాస్త్ర ఉవాచ
    అది మొదలు ఈ సమయంలో ప్రపంచములోని అన్నీ ప్రదేశములలో అంతుతెలియని లేదా తీవ్రమైన అంటు వ్యాధులు ప్రభలీల్లడము, లేదా అనుకోని సమస్యలు శత్రువుల వలన ఏర్పడటము జరిగి ప్రజలు నానా అనారోగ్యముల పాలై తీవ్రమైన భాధలను అనుభవించడము, అందులో కొందరు మరణాలను కూడా పొందడము జరుగుతుంది.

(మనం గమనించినట్లైతే ప్రతి సంవత్సరము కూడా మిగతా రోజులతో పోలిస్తే ఈ రోజులలో యాక్సిడెంట్స్ ద్వారా గాని, వ్యాధుల ద్వారా గాని జరిగే మరణాల సంఖ్య ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. మీరు గమనించవచ్చు.)

అందువలన ఈ సమయంలో అమ్మవారిని శాస్త్రోక్తంగా పూజించి అర్చించి ఉపాసనాది అనుష్టానములను నిర్వహించడము ద్వారా ఆయా దోషముల నుండి విముక్తి కల్గి ఋణ, రోగ, శత్రు భాధలనుండి బయట పడుటకు అవకాశము కలదు .

అంతేకాకుండా ఉపాసనకు ఒక రోజులో అత్యంత ముఖ్యమైన లేదా ఉత్క్రుష్టమైన కాలము ఏమిటంటే అది బ్రహ్మ ముహూర్త కాలము అనగా సూర్యోదయమునకు 48 నిముషముల ముందు సమయము.

సంవత్సరమునంతా కూడా ఒక రోజుగా భావన చేసినట్లైతే ఈ శరదృతువులో వస్తున్న అశ్వియుజ శుద్ద పాడ్యమి తిధి నుండి నవమి వరకు గల సమయము బ్రాహ్మీ ముహూర్తము అవుతుంది. అనగా ఒక సంవత్సరానికి మొత్తం కూడా తెల్లవారు ఝాము లేదా బ్రాహ్మీ ముహూర్త కాలము ఏమిటంటే అది దేవి నవరాత్రుల కాలము అని చెప్పవచ్చు .

అందువలన ఈ సమయము లో చేయు అన్నీ రకములైన అనుష్టానములు, జపములు, ఉపాసనలు త్వరగా ఫలించి సిద్దించుటకు అవకాశం ఉన్నది.

జ్యోతిషపరంగా

అంతే కాకుండా జ్యోతిషపరంగా గనుక మనం గమనించినట్లైతే ఈ సమయంలో ఆత్మ కారకుడు అయిన సూర్య భగవానుడు కన్యా రాశిలో సంచారము చేస్తూ ఉంటాడు. ఈ కన్యా రాశ్యాధిపతి అయిన బుధుడు జ్ఞానమునకు, మంత్రసిద్దికి, విధ్యకు కారకుడు.

కావున రాశి చక్రం ప్రకారము సహజ పంచమాధిపతి (జ్ఞానము, మంత్రసిద్ది) అయిన రవి సహజ ఋణ, రోగ, శతృ క్షేత్రమైన కన్య లోకి ప్రవేశము చేయడము వలన గత జన్మ పుణ్యము తగ్గిపోవడము వలన జ్ఞానము నశించి చిన్న చిన్న విషయాలకే కలత చెందుతూ అనారోగ్యములకు గురై తద్వారా తీసుకున్న నిర్ణయాల వలన శత్రువులను పెంచుకోవడమువలన శాంతిని, సుఖమును కోల్పోవడము జరుగుతుంది .

అయితే ఈ సమయములో సరియైన గురువును ఆశ్రయించి తగిన విధముగా అర్హతను బట్టి మంత్రము నో లేదా తగు సలహనో పొండటము ద్వారా దైవారాధన చేయడము, అవకాశము ఉన్నంతలో నిజంగా అవసరం ఉన్న వారికి తగిన విధముగా సహాయ, సహకారములను అందించడము వలన పుణ్య బలము పెరిగి జ్ఞానము కల్గి చేయు పనులలో ఆటంకములు తొలగి, సంపూర్ణ ఆయుర్ ఆరోగ్యములను పొందే అవకాశము ఉంటుంది.

మీరు గమనించి నట్లైతే ఈ సమయములో సమాజములో చర్మ, లివరు, గాల్ బ్లాడర్, జీర్ణాశయ, ఉదర సమస్యలు, మరియు తీవ్రమైన లేదా ప్రాణాంతకమైన జ్వరాలు, విసర్జనావయములకు సంభందించిన సమస్యలు రావడము వలన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశము ఉంది. లేదా ఇప్పటికే ఆయా సమస్యలను ఎదుర్కొనే వారికి అవి మరి కొంత పెరిగి ఇబ్బంది పెట్టె అవకాశము ఉన్నది.

మరికొంత మంది తాము చేస్తున్న పని విషయం లో సహచరుల వలన ఆటంకాలు ఎదురవడము లేదా వారి వలన సకాలములలో ఆయా పనులు కాక అవస్తలు పడే అవకాశము ఉన్నది.

మరొక అశ్చర్యకరమైన అంశము ఏమిటంటే అమ్మవారికి సంభందించిన ఈ వ్యాసము చదువుతున్న సమయములో మీ శరీరము మీద లేదా సమీపములో ఎరుపు లేదా బులుగు రంగుకు సంభందించిన ఛాయలు (షేడ్స్) కల్గిన రంగులను మీరు గమనిస్తారు .

ఇంకా ఉంది ..

దసరా పండుగ నిర్ణయంఎలా చేస్తారు? పండుగ జరుపుకునే విధానం ఏమిటి ?

రాఘవేంద్ర. ఏం.ఏ. జ్యోతిష్యం.స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం : 5
హైదరాబాద్
astroguru81@gmail.com

 

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Navaratri Durga Puja Related Posts

మహాలయ అమావాస్య (14 అక్టోబర్) రోజు మీ పితృదేవతల ప్రీతి కోసం ఈ సంతర్పణ చేయండి! | Mahalaya Amavasya Pitru Devata Santarpanam

దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

శరన్నవరాత్రి పూజను ఉదయం చేయాలా? లేక రాత్రి వేళ చేయాలా? | Dussehra Devi Sharan Navaratri Pooja Vidh & Rules

Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం

దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ? | Navaratri 2024

https://hariome.com/sri-bala-tripura-sundari-decoration/

శరన్నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ విశేషాలు | Sri Gayatri Devi Alamkaram

శరన్నవరాత్రులలో శ్రీ అన్నపూర్ణా దేవి అలంకరణ విశేషాలు

https://hariome.com/sri-mahalakshmi-alakarana-dasara-in-telugu/

శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi

https://hariome.com/sri-saraswati-devi-dasara/

శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ | Navaratri 2024 Fourth Day Alamkaram – Sri Lalita Tripura Sundari

శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana 8th Day of Navaratri 2024

https://hariome.com/sri-mahishasura-mardini/

https://hariome.com/sri-rajarajeshwari-devi/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here