shuklaambara dharam vishnum slokam meaning

dsci1090
shuklaambara dharam vishnum slokam

shuklaambara dharam vishnum slokam

Next

2. తెలుగు

“శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయె” 

 

శుక్ల+అంబర+ధరం –శుభ్రమైన వస్త్రము ధరించినవాడు (ఇది మనకు బాహ్యముగా కనిపించే అర్థము)

దీనిలోని అంతరార్థమేమిటంటే  నక్షత్రములతో కూడిన స్వచ్చమైన ఆకాశము కలిగినవాడు అని చెప్పవచ్చును. 

విష్ణుం — సర్వాంతర్యామి ఐనవాడు 

శశి వర్ణం –చందన ఛాయ కలిగినవాడు (చంద్రుడు ఆ రంగు లోనే వుంటాడు కదా)

చతుర్భుజం –నాలుగు భుజములు కలిగినవాడు . పాశము, అంకుశము, మోదకము మరియు అభయ 


హస్తము కలిగినవాడు అన్నది స్థూలమైన  అర్థము.  మన ఆశా పాశమునకు అంకుశము వేస్తే ఆయనకది 


మోదకము. అప్పుడు ఆయన అభయహస్తము మనకు సిద్ధిస్తుంది. 


ఆయన సర్వాంతర్యామి అని చెప్పుకొన్నాము గదా మరి సర్వాంతర్యామికి నాలుగు భుజాలేవి : నాలుగు 


దిక్కులూ కావచ్చు నాలుగు వేదములు కావచ్చు . 

ప్రసన్న వదనం : నగుమోము కలిగినవాడు అన్నది స్థూలమైన అర్థం . 

‘నిరుక్తము’ను ఆశ్రయించితే  ‘ప్రసన్నో గజయూధపః’ అని తెలియబరచుతుంది . గజయూధము అంటే ఏనుగుల సమూహము. ‘ప’ అంటే అధిపతి రాజు అని అర్థం . ఒకటి కాదు రెండు కాదు చతుర్దశ  భువనాలలోని ఏనుగులకూ ఆయన అధిపతి. అంటే ఆయన ఎవరు ‘గజాననుడే.’

సర్వ విఘ్నోపశాంతయే– ఆటంకముల నన్నింటినీ మట్టుబెట్టుటకు (సర్వ+ విఘ్న ఉపశాంతయే)

ధ్యాయేత్ –ప్రార్థింతుము . 

Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here