Mauni Amavasya 2025 in Telugu | మౌని అమావాస్య నిజంగా అంత ప్రమాదకరామా? ఇందులో నిజమెంత?

2
33037
Mauni Amavasya in Telugu
Mauni Amavasya 2025 in Telugu

Mauni Amavasya 2025

1మౌని అమావాస్య

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

What is Mauni Amavasya?

సాదారణముగా ఈ మౌని అమావాస్య అనేది సూర్యుడు ఉత్తారాయణములోకి ప్రవేశించిన తర్వాత వచ్చే మొదటి అమావాస్యని పుష్య అమావాస్య అని లేదా మౌని అమావాస్య అని అంటారు.

Mauni Amavasya 2025 Date and Time

మౌని అమావాస్య 2025 జనవరి 29, బుధవారం రోజున వస్తుంది.

అమావాస్య తిథి ప్రారంభం – జనవరి 28, 2025న 07:36 PM
అమావాస్య తిథి ముగుస్తుంది – జనవరి 29, 2025న 06:05 PM

అయితే ఆయా ప్రదేశాల అక్షాంశ, రేఖాంశములను బట్టి సమయములో కొన్ని నిముషాలు అటు, ఇటు గా మారుతూ ఉంటుంది.

మనం గతములో చెప్పుకున్నట్లుగానే ప్రతి అమావాస్య కూడా సమాజము మీద కొంత మేర తన ప్రభావమును చూయించడము ద్వారా కొంత చెడు సంఘటనలు జరగటానికి కారణము అవుతుంది.

అయితే ఆ అమావాస్య ఏ మాసములో వచ్చింది, అనేదాన్ని బట్టి, ఆయా ప్రదేశాలను బట్టి అది ప్రభావము చూయించే అంశాలు, మారుతూ ఉంటాయి.

ఆరకముగా తీసుకున్నట్లైతే ప్రస్తుతం ఈ అమావాస్య పుష్య మాసములో వచ్చింది. అందువలన ఈ అమావాస్య ప్రభావము సమాజము మీద చూయించినంతగా వ్యక్తిగతముగా చూయించదని చెప్పవచ్చు.

మౌని అమావాస్య ఆచారాలు:

  1. భక్తులు మౌని అమావాస్య రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయం సమయంలో గంగానదిలో పుణ్యస్నానం చేస్తారు.
  2. గంగానదిని సందర్శించలేకపోయిన వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలిపి స్నానం చేయాలి.
  3. స్నానం చేసేటప్పుడు నిశ్చలంగా ఉండడం ముఖ్యమైన ఆచారం.
  4. భక్తులు బ్రహ్మ దేవుడిని పూజించి, గాయత్రీ మంత్రాన్ని జపిస్తారు.
  5. స్నాన ఆచారం అనంతరం ధ్యానంలో నిమగ్నమవుతారు, ఇది ఏకాగ్రత, అంతర్గత శాంతిని అందిస్తుంది.
  6. ఈ రోజున తప్పుడు చర్యలకు దూరంగా ఉండాలి.
  7. కొంతమంది భక్తులు “మౌన వ్రతం” పాటిస్తారు, రోజంతా మాట్లాడకుండా ఉంటారు.
  8. రోజంతా మౌనం పాటించలేనివారు పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు మాత్రమే మౌనం పాటించవచ్చు.

మౌని అమావాస్య ప్రత్యేకతలు:

  1. మౌని అమావాస్య రోజున వేలాది మంది భక్తులు ప్రయాగలోని సంగమంలో పవిత్ర స్నానం చేస్తారు.
  2. ఈ రోజు పితృ దోషం నుండి విముక్తి పొందేందుకు అనుకూలంగా ఉంటుంది.
  3. ప్రజలు తమ పూర్వీకులకు తర్పణం సమర్పించి, వారి ఆశీర్వాదాలను కోరుతారు.
  4. కుక్క, కాకి, ఆవు మరియు కుష్ట రోగులకు ఆహారం అందించడాన్ని ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు.
  5. పేదలకు ఆహారం, బట్టలు, నిత్యావసరాలను దానం చేస్తారు.
  6. శని దేవుడికి నువ్వుల నూనె సమర్పించే ఆచారం ఉంది.

పవిత్ర జలాల్లో స్నాన ప్రాముఖ్యత:

  1. హిందూ గ్రంధాల ప్రకారం, మౌని అమావాస్య రోజున గంగా నదిలోని నీరు అమృతంగా మారుతుందని నమ్మకం.
  2. భక్తులు పౌష పూర్ణిమ నుండి మాఘ పూర్ణిమ వరకు పవిత్ర స్నానాలు చేస్తారు.
  3. మాఘ మాసంలో మౌని అమావాస్య అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు.

మౌని అమావాస్య రోజు మౌనంగా వుండాలా ? (Should be Silent on the Day of Mauni Amavasya?)

పేరులోనే మౌనం ఉంది కాబట్టి ఈ అమావాస్యకి మనుషులందరు మౌనంగా లేక పోతే ఏదో చెప్పనలవి కాని ఉపద్రవాలు వస్తాయి !!!! ??? .. అని జరిగే ప్రచారములో ఎంత మాత్రము వాస్తవము లేదు. అసలు అది ఆచరనాత్మకం (practical) కూడా కాదు . కాబట్టి బయపడనవసరం లేదు.

ఇదంతా కూడా కొందరు అవగాహన లేని, అత్తెసురు జ్ఞానము కల్గిన పండితులు తమయొక్క పాండిత్య ప్రకర్ష ను చూయించుకోవడానికి చేసే అర్ధ రహిత ప్రచారమే అని ఘంటాపదముగా చెప్పవచ్చు.
కాబట్టి మనం అంతా కూడా ఈ అమావాస్యని మిగతా అమావాస్యలాగే పరిగణించి కొన్ని సాదారణ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

అయితే ఈ అమావాస్య అనంతరము నుండి రాబోవు అక్టోబర్ లోపు సమాజములో కొన్ని చెడు సంఘటనలు జరుగుటకు అవకాశము ఉన్నమాట వాస్తమే(ఈ అంశము గురించి మరోసారి తెల్సుకుందాము) … ఎందుకంటే శనిభగవానుడు సాదారణముగా ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. అటువంటి ఈ శనీశ్వరుడు తాను ధనుర్రాసిలోకి రావలసిన దానికన్నా ముందుగానే (అతిచారము) ప్రవేశము చేయడము అదే సమయంలో కొన్ని పాపగ్రహ కూటములతో సంభంధము ఏర్పడటము వలన ఈ విదమైన పరిస్తితి ఏర్పడటానికి కారణం అయ్యింది. అంతే కానీ ఈ మౌని అమావాస్యకి, మౌనంగా ఉండకపోతే సమస్యలు ఏర్పడటానికి అస్సలు సంభంధమే లేదు.

ఈ అమావాస్య రోజు మనమంతా యధావిధిగా భగవత్ ఆరాధనతో గడుపుదాము.

!! సర్వే జనా సుఖినో భవతు !!

మీ
రాఘవేంద్ర
కనినీక నాడీ జ్యోతిష వాస్తు శాస్త్ర నిపుణులు

Related Posts

Chaitra Amavasya 2025 | చైత్ర అమావాస్య యొక్క ప్రాముఖ్యత, చేయవల్సిన పరిహారాలు

అమావాస్య రోజు ఇలా చేస్తే ఇక డబ్బుకి లోటుండదు | Amavasya Pooja Significance in Telugu !

Polala Amavasya 2025 | పొలాల అమావాస్య ఈ నియమాలు పాటిస్తే జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.

ఈ రోజు చుక్కల అమావాస్య – గౌరీవ్రతం | Chukkala Amavasya Puja Gauri Vratam In Telugu

Somavathi Amavasya | జాతక దోషాలను నివారించే సోమావతి అమావాస్య

https://hariome.com/2023-festival-calendar/

కొత్త అమావాస్య | Kotha Amavasya in Telugu

Chukkala Amavasya Puja, Gauri Vratam

All you need to know about “Polala Amavasya”

మహాలయ అమావాస్య – ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

2 COMMENTS

  1. అర్ఘ్యము ఇచ్చుటకు ఏ నియమాలు పాటించాలి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here