ఈరోజు – జాతక దోషాలను నివారించే సోమావతి అమావాస్య | Somavathi Amavasya in Telugu

0
11526
జాతక దోషాలను పోగొట్టే సోమావతి అమావాస్య
Somvati Amavasya

Somvati Amavasya in Telugu

సోమవారం నాడు వచ్చే అమావాస్యకు హిందూధర్మం లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆరోజుని సోమావతి అమావాస్య అంటారు. ఈ రోజు ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే జాతకం లో ఉండే సకల దోషాలు పోతాయి.

సోమావతి అమావాస్య కథ :

ఒకానొక ఊరిలో ఒక సాధువు ఓ వర్తక వ్యాపారి కుటుంబానికి వస్తూ ఉండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంటిలోని పెళ్లికాని ఒక కన్యను ఆమె ముఖం చూసి దీవించకుండా నే వెళ్లిపోయాడు.

సాధువు దీవించకుండా వెళ్లడానికి కారణం తెలియక ఆ కుటుంబం ఎంతో బాధ పడింది.

చివరికి పురోహితుని పిలిపించి కారణం అడుగగా , ఆయన ఆమె జాతకం చూసి, ఈమెకు వివాహం జరిగితే భర్త అనతి కాలం లోనే మరణిస్తాడు.

ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది. అని చెప్పాడు. అది విని దిగ్భ్రాంతి చెందిన కుటుంబీకులు పరిష్కారం చెప్పమని పురోహితుని ప్రార్థించారు.

ఆయన సింఘాల్ ప్రాంతం లోని ఒక చాకలి స్త్రీ ని కుంకుమ అడిగి నుదుట ధరిస్తే దోషం పోతుందని చెప్పాడు.

వర్తకుడు ఆ అవివాహిత అయిన కన్యనూ,తన చిన్న కొడుకునూ అక్కడికి పంపుతాడు. మార్గ మధ్యం లో ఒక నదిని దాటబోతుండగా అక్కడ వారికి ఒక దృశ్యం కనిపించింది.

అప్పుడే పుట్టిన  గద్ద పిల్లను ఒక పెద్ద పాము చంపి తినడానికి వస్తోంది. నిత్యం అక్కడ ఇదే జరుగుతుండేది. గద్ద పిల్ల పుట్టిన వెంటనే పామువచ్చి వాటిని తిని వెళ్లిపోయేది.

కానీ ఆరోజు ఆయువతి ధైర్యంగా ఆ పామును చంపి గద్ద పిల్లను కాపాడింది. తన పిల్లను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ గద్ద వారికి చాకలి స్త్రీ ఇంటికి దారిచూపింది.

కొన్ని నెలల పాటు ఆ చాకలామెకు సేవచేయగా ఒక సోమావతి అమావాస్య నాడు ఆమె ఈ యువతికి కుంకుమనిచ్చింది.

ఆమె వెంటనే మంచి నీరు కూడా తాగకుండా రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసింది. ఆమె జాతక దోషం అంతటితో తొలగిపోయింది.

సోమావతి అమావాస్యనాడు మౌనంగా శివారాధన చేసి,రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి, ఈ కథను ఒక సారి గుర్తుచేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు పోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here