Lord Subrahmanya Ritual | వివాహం, సంతానం మరియు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?

5
69108
Lord Subrahmanya Ritual for Marriage, Money and Kids in Telugu
Subrahmanya Ritual for Marriage

Lord Subrahmanya Ritual for Marriage, Money and Kids in Telugu

1. సుబ్రహ్మణ్య స్వామి

వివాహం ఆలస్యమవుతోందా..? సంతానం కలగడం లేదా..? ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీ సమస్యలకు చక్కని పరిష్కారం సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజ. ప్రతి మాసం లోనూ వచ్చే శుద్ధ షష్టి నాడు మాస షష్టి వ్రతం చేయడం అత్యంత శుభకరం.

మాస షష్టి వ్రతం ఎలా చేయాలి? (How to do Masa Shashti Vrat?)

సుబ్రహ్మణ్య స్వామి జన్మతిథి షష్టి. షష్టి తిథి స్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజున సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనె తో దీపారాధన చేయాలి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించాలి.స్వామికి శాస్త్ర యుక్తంగా షోడశోపచార పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆరోజున ఉపవసించడం అత్యంత శ్రేయస్కరం. సమీపం లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి, స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయాలి.

దక్షిణ

షష్టి రోజున బ్రహ్మచారికి భోజనం పెట్టి, తాంబూలం, దక్షిణ సమర్పించాలి.  కుజ దోషాలు ఉన్నవారు ఎర్ర కందులను దానం చేయాలి.

షష్టి పూజ వలన కలిగే లాభాలు (Benefits of Shashti Puja)

సుబ్రహ్మణ్య స్వామి అంగారక(కుజ) గ్రహానికి అధిపతి. కనుక కుజుని వలన కలిగే అన్ని దోషాలనూ షష్టి వ్రతం చేయడం వలన నివారించవచ్చు. షష్టి వ్రతం చేయడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్నవారికి శీఘ్ర వివాహం జరుగుతుంది. ధనప్రాప్తి కలుగుతుంది.

 సుబ్రహ్మణ్య స్వామికి ఏ నైవేద్యం పెడితే ఎటువంటి ఫలితం కలుగుతుంది ? (What is the result of offering to Lord Subrahmanya?)

సుబ్రహ్మణ్య స్వామికి అరటిపళ్లు నైవేద్యం పెట్టడం వలన సంతానం కలుగుతుంది. ఎర్ర కందులతో చేసిన పాయసాన్ని నివేదించడం వలన కుజగ్రహ దోషాలు తొలగుతాయి. దానిమ్మ పళ్లను నివేదించడం ద్వారా ఐశ్వర్య సిద్ధి, వివాహ యోగం కలుగుతాయి.

శుభం భూయాత్.

Subrahmanya Swamy Related Posts:

Subrahmanya Panchartnam In Telugu | భోగ భాగ్యాలను ప్రసాదించే సుబ్రహ్మణ్య పంచరత్నం

కాల సర్పదోషాన్ని నివారించే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వరుడు | Worship Kukki Subrahmanya to avoid Kala Sarpa Dosha in Telugu

 

Subramanya Shasti 2025 | సుబ్రహ్మణ్య షష్ఠి పూజ విధి, ఉపవాస నియమాలు, వ్రత కథ.

సుబ్రహ్మణ్య స్వామి కి ఉన్న ప్రముఖ మైన పేర్లు | Subramanian Swamy God other Names in Telugu

శ్రీ సుబ్రాహ్మణ్య అష్టోత్తర శతనామావళిః | Shri Subramanya Ashtotara Shatanamavalli In Telugu.

Importance of Shukla Paksha

Promoted Content

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here