1. జ్యోతిష్య శాస్త్రరీత్యా
దసరా సందర్భముగా నేను వ్రాసిన మొదటి పోస్ట్ లో అసలు దసరా జరుపుకోవడములోని అంతర్యమేమిటి అనే అంశమును గురించి మన పూర్వీకులు పురాణ ,ఇతి హాసముల ద్వారా ఏమి చెప్పారు అనే అంశము ను గురించి వివరించే ప్రయత్నం చేస్తూ అందులో నేను ఈ దసరా అనునది శరదృతువులో వచ్చే అశ్వీయుజ పాడ్యమి నుండి నవమి వరకు ఉంటుందని ఇయా సమయములో యమధర్మ రాజు కి ఒకవైపు కోర (దంతము) రావడము వలన జీవుల యొక్క గత జన్మ పాప పుణ్యములను అనుసరించి వారిని ఋణ, రోగ, శత్రువుల రూపంలో తగిన విధముగా శిక్షించే ప్రయత్నం చేస్తాడని ఈ సమయంలో జాతకములోని గ్రహాలు బలహీనముగా ఉన్న కొందరు మృత్యువును కూడా పొందే అవకాశము ఉంటుందని ఈ సందర్భముగా చెప్పడము జరిగింది .కావున అటువంటి వారందరు కూడా ఈ దసరా సందర్భముగా అమ్మవారిని అవకాశమున్నంతలో శాస్త్రీయముగా పూజించి అర్చించడము ద్వారా తగు పరిహారము పొంది ఆయా సమస్యలనుండి బయటపడు అవకాశము ఉంటుందని నేను అందులో విన్నవించడము జరిగింది. అది చదివిన వారిలో కొన్ని వందల మంది తగిన జ్యోతిష సలహా సూచనల కొరకు నాకు ఫోన్ చేయడము జరిగినది.
మరిన్ని వివరాల కొరకు నేను వ్రాసిన ఆ పోస్ట్ ను ఈ లింక్ లో గమనించగలరు .