
Hinduism and beliefs / హిందూత్వం – నమ్మకాలు
2. జ్ఞానానికి మొదటి మెట్టు భక్తి
భక్తి జ్ఞానాన్ని ఇస్తుంది. నేను నాది అన్న మాయ నుంచీ బయట పడాలంటే భక్తి కి మించిన మార్గం లేదు. మోహ బంధాలను విడిపించుకున్నాక, నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. ఆ స్వేచ్ఛ జ్ఞానానికి పునాది. అప్పుడు మొదట ‘నేను’ అంటే ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఆ సమయం లో యోగం సహాయంతో మనిషి తనను తాను పూర్తిగా తెలుసుకోగలడు. సాధన ద్వారా తనలో ఇమిడి ఉన్న పరమాత్మ తత్వాన్ని, విశ్వాన్ని తెలుసుకోగలడు. కాలాన్ని, శక్తిని ఆరాధించి, ఆశ్రయించి అంతులేని విజ్ఞానాన్ని సంపాదించుకోగలడు. భక్తి, జ్ఞానం ఒకటే అన్న అద్వితీయతను గ్రహించడం వల్లే హిందువులు భగవంతుని ఆరాధనకు అంత ప్రాముఖ్యతను ఇస్తారు. నిజమైన భక్తి తో భగవంతునికి చేసే ఒక్క నమస్కారమైనా మనకు గొప్ప మేలు చేస్తుంది.
శుభం.
Promoted Content