
రాముడు దేవుడా ? | Lord Rama
రామా అన్న ఒక్క పేరును జపిస్తే కోటి పుణ్యాల ఫలం వస్తుంది అని చెప్తారు. వాలిని చెట్టు చాటు నుంచి పినవాడు .. ఎవడో మాటలు విని భార్యను అడవుల పాలు చేసిన వాడు ఆదర్శ మూర్తి ఎలా అయ్యాడు? నిజంగా రాముడు ఎలా గొప్ప అనే అంశం మీద వాదాలు, వివాదాలూ ఉన్నాయి.
అయినా సరే మెజారిటీ ప్రజలు భారత దేశంలో ఆదర్శపురుషుడు ఎవరంటే ముందుగా వచ్చే పేరు శ్రీరాముడు, రామరాజ్యం రావాలని, రాముడి లాంటి పాలకులు రావాలని ఎందుకు కోరుకుంటారు?
ఆదర్శ దంపతులు ఎవరంటే సీతారాములు, ఆదర్శపాలకుడు ఎవరంటే శ్రీరాముడు, ఆదర్శ రాజ్యం ఏదంటే రామరాజ్యం. ఇది చాలదా మనకు అయన యొక్క గొప్పదనం ఏమిటో .
అసలు దేవుడా అనే సందేహం వచ్చింది అంటే వారికి రామాయణం మీద ఎలాంటి స్పష్టమైన అవగాహన లేనట్టే. వాలిని చెట్టు చాటు నుంచి చంపినవాడు అంటే ముందు ఒక ప్రశ్న వాలి ఎవరు మనిషా ? జంతువా ? అయినా వాలి దుర్గుణములు లెక్కించారా పోనీ శూర్పణక విషయం చూసినా శూర్పణక రాక్షసి నా కేవలం స్త్రీ మాత్రమే నా ? ఎవరో మాటలు తెలిసిన తర్వాత రాజు గా ఆలోచన చేసాడా ? లేక వ్యక్తి గా చుసాడా ? ధర్మ అధర్మ విషయములు ఎన్నో ఆలోచించే సామర్ద్యం ఉండాలి కదా పురాణాల ప్రకారమే నమ్మితే రాముడు దేవుడు అంతకన్నా ముందు ఆయన మనిషి జీవితంలో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో రాముడు చేసి చూపించాడు. అన్న విషయం మనం గమనించాలి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలన్నీ కొద్ది నిమిషాల్లో ముగిసినవే.మరి రామావతారం మాత్రం వాల్మీకి రామాయణం ప్రకారం పదకొండు వేల సంవత్సరాలు ఎలా కొనసాగింది ? అంతకు ముందు వచ్చిన అన్ని అవతారాల్లోనూ ఆయన చేసింది అదే.. దిగివచ్చిన దేవుడు రాముడిగా ఎందుకు అష్టకష్టాలు పడినట్లు. వనవాసం ఎందుకు చేసాడు.? నేరుగా వెళ్లి రావణుడితో యుద్ధం చేసి హతమార్చి ఉండవచ్చు కదా.. కేవలం మానవమాత్రుడిలాగా ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొన్నాడు? ఈ రాముడు దైవమా? దైవంగా ఎదిగిన మనీషా?రాముడు దేవుడే అయితే, ఎందుకిలా కష్టపడ్డాడన్న ప్రశ్న హేతుబద్ధమే. కానీ, ఇక్కడే ట్విస్ట్ ఉంది. పురాణాల ప్రకారమే అయితే, విష్ణుమూర్తి అవతారాల్లో పూర్ణమానవుడిగా అవతరించిన సందర్భం రాముడే. మనిషి జీవితంలో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో రాముడు చేసి చూపించాడు.
చివరిగా చెప్పదలిచింది ఒకటే రాముడు ముమ్మాటికీ దేవుడే జై శ్రీ రాం .