నిమ్మకాయల దీపం…అంటే పార్వతి దేవికి ఎందుకు ప్రీతి

0
16592

diyasinlemon

నిమ్మకాయ లంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతి దేవికి బాగా ఇష్టం . నిమ్మకాయలతో చేసిన మాలని పార్వతి దేవికి … గ్రామ దేవతలు అయిన మైసమ్మ , ఎల్లమ్మ , మొదలైన శక్తి దేవి అవతారాలకి వేస్తారు .

పార్వతి దేవి లేక పార్వతి దేవి స్వరూపాలు అయిన
అంబా భవానీ, కాళీ ,చౌడేశ్వరి ,మారియమ్మ ,దుర్గ ,గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి .

* ఎటువంటి పరిస్థితుల్లోనూ
మహాలక్ష్మి ,సరస్వతి ,మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడధు .
ఒక వేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండధు . సంసారం లో ఎప్పుడు గొడవలు ఉంటాయి , ఆర్ధిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది ,ఇంట్లో అకాల మృత్యువు సంభవిస్తాయి ,భార్య – భర్త , పిల్లలు , స్నేహితులు , బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి.

* పార్వతి దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవి వారాలుగా పరిగిణించే మంగళవారం , శుక్రవారాల్లో రాహుకాల సమయాల్లో మాత్రమే వెలిగిస్తారు .
మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు …
శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు .

* మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది . ఎందుకంటే మంగళ వారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది . శుక్రవారం వెలిగించే దీపం సత్వ గుణాన్ని కలిగి ఉంటుంది ..

* శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది .

* శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగు అన్నం ,లేదా పెసరపప్పు ,లేదా వడపప్పు ,లేదా పానకం ,
లేక మజ్జిగ లేక పండ్లను దేవికి నైవేద్యము పెట్టి తరువాత సుమంగళికి ఇవ్వాలి .
కుదిరితే పసుపు , కుంకుమ , పూలు , గాజులు , జాకెట్టు ముక్క , చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం . తాంబూలం దానం మరియు శక్తికి తగినట్లు గా దక్షిణ ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయాలి .. ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటకం లేకుండా శుభప్రదంగా , త్వరగా నెరవేరతాయి …

* నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గమనించవల్సిన అంశాలు :-

* ఎటువంటి పరిస్థితుల్లో ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు నిమ్మకాయల దీపాలను వెలిగించ కూడదు .

* ఎటువంటి కారణం గా నైనా ఇంటి లోపల నిమ్మకాయల దీపాన్ని వెలిగించకూడధు .

* బహిష్టు సమయం లో ఈ నిమ్మకాయ దీపాలు వెలిగించకూడధు . మహిళలు 4వ రోజు తల స్నానం చేసి 5 వ రోజు స్నానం చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించకూడధు .

* మైలు తో ఉన్నప్పుడుకూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడధు .

* ఆరోగ్య౦ సరిగ్గా లేనప్పుడు నిమ్మకాయల దీపాలని వెలిగించకూడధు .

* ఇంట్లో పండుగ సమయం , పెద్దల తిధి కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించకూడధు .

* పిల్లల పుట్టిన రోజున , పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడధు .

* ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఇంట్లో రెండు రకాల దీపాలు వెలిగించకూడధు . అంటే నిమ్మకాయ దీపం తో పాటు ఇంకో నూనె దీపం వెలిగించకూడధు .

* వేరే ఊరు వెళ్లినప్పుడు మిత్రుల మరియు బంధుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడధు .

* ఆడపిల్లలు , అక్క , చెల్లిళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్లినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించ కూడధు

* స్త్రీలు పట్టు చీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్నీ కార్యాలు ఎలాంటి లోపాలు లేకుడా జరిగిపోతాయి .

* స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి .

* ఆధునిక వస్త్రధారణతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే పఃలితం లభించదు.

https://www.facebook.com/photo.php?fbid=214778945527753&set=a.159421807730134.1073741828.100009869479425&type=3&theater

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here