పరమ పవిత్రమైన హంసలదీవి ఎక్కడ ఉందో, చరిత్ర ఏమిటో తెలుసా? | Where the Holy Hamsaladeevi located in Telugu

1
12485
Hamsaladeevi
Hamsaladeevi

10151906_631326503636380_5276052725866860201_n

Where the holy Hamsaladeevi located. what is the history?

Next

4. ఇంకొక స్థలపురాణ కథ

శ్రీ వేణుగోపాలస్వామి వారి ప్రాదుర్భావాన్ని గూర్చి కథ ఒకటి జనశృతిగా ప్రాచుర్యం లో ఉంది. పూర్వకాలం ఈ ప్రాంతంలో ఒక పెద్ద పుట్ట ఉండేదట.

స్వామి దానిలో ఉండేవాడట. మేతమేసిన ఆవులు ఆ పుట్ట దగ్గరకు వచ్చి స్వామికి పుట్టలోకి పాలు కార్చేవట. సాయంత్రం ఆవులు పాలు ఇవ్వకపోవడంతో అనుమానమొచ్చి, మాటువేసి కారణం కనిపెట్టారు గోపాలురు.

ఆవులు పుట్ట పైకి వెళ్లి పాలుకార్చడం చూచి, కోపం ఆపుకోలేక, చెత్తంతా పోగు చేసి పుట్టమీద వేసి నిప్పుపెట్టారట.

పుట్టలోని స్వామికి వేడితగలడం, ఇంతలో ఒకరికి పూనకం వచ్చి స్వామి ఉన్న విషయాన్ని చెప్పడం, క్షమా భిక్ష కోరుకున్న భక్తులు స్వామివారి విగ్రహాన్ని ప్రతి ష్టించి పూజలు నిర్వహించడం జరిగిపోయింది.

కాలాంతరంలో ఆ విగ్రహం భిన్నమైపోగా, స్వామి గ్రామస్తులకు కలలో కన్పించి కాకరపఱ్ఱు మునసబు గారి దొడ్లో ఉన్నానని చెప్ప డంతో గ్రామస్తులు వెళ్లి ఊరేగింపుగా స్వామి వారిని తీసు కొచ్చి ప్రతిష్టించారట.

ఆ విగ్రహమే ఇప్పుడు పూజలం దుకుంటున్నది. భిన్న మైన విగ్రహం ఇప్పటిక్కూడా అలం కరించబడిన మూలవిరాట్ ప్రక్కనే మనకు దర్శనమిస్తోంది.

ఈ ఆలయంలో వివాహం చేసు కొని, సాగరసంగమ ప్రదేశంలో సరిగంగ స్నానాలు చేస్తే ఆ జంటలు సుఖంగా నూరేళ్ళు జీవిస్తా రనేది భక్తుల విశ్వాసం.

ఈ ఆలయంలో నిద్రచేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగు తుందని చెపుతారు. ఆలయం చుట్టూ ఉన్న కుడ్యాలలో ఎన్నో అందమైన శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. ఆలయానికి ఈశాన్యంలో పురాతన కట్టుబడితో కళ్యాణ మండపం కన్పిస్తుంది.

జరిగే ఉత్సవాలు

మాఘ పౌర్ణమికి స్వామివారి కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, ధను ర్మాసం, ప్రత్యేక ఉత్సవాలు. కార్తీకమాసంలో సముద్ర స్నానం చేసిన వేలాది మంది భక్తులు తప్పనిసరిగా స్వామిని దర్శిస్తారు.

ఈ ఆలయం తుపానులు, ఉప్పెనల నుండి గ్రామస్తులను కాపాడుతూ వస్తోంది. 1864, 1977 ఉప్పెన ల నుండి ఎందరో గ్రామస్తుల ప్రాణాలను కాపాడిన ఘనచరిత్ర ఈ ఆలయానిది.

సుమారు 6, 7 వందల సం వత్సరాల క్రితం నిర్మించిన ఆలయమే అయినా ఉప్పెనలకు చెక్కుచెదరకుండా నిలబడటమే కాకుండా, కొన్నివం దల ప్రాణాలను నిలబట్టిన ఘనత ఈ ఆలయ సొంతం.

ఇటువంటి గట్టి కట్టడాన్ని నిర్మించిన ఆ శిల్పులను ఒక్కసారి గుర్తుచేసుకొని జోహార్లు అర్పించాలి. శ్రీజనార్ధ నస్వామి, శ్రీ రాజ్యలక్ష్మి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి.

ఈ ఆలయానికి సమీపంలోనే బాలాత్రిపురసుందరి, అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయం కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడ పడి ఉన్న కొన్ని శిథిల శిల్పాలు చెదిరిన మన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా కనబడతాయి.

ఈ ప్రదేశం ఎక్కడుంది? ఎలా వెళ్ళవచ్చు?

కృష్ణాజిల్లా కోడూరు నుండి 15 కి.మీ దూరం లోనూ, మోపిదేవి నుండి 28 కి.మీ దూరంలోను బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది.

Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here