చనిపోయినవారి ఆత్మలు తర్వాత కూడా ఉంటాయా? | Do Spirits Come Back After Death in Telugu

do spirits come back after deathమరణం అనేది ఏ ప్రాణికైనా సహజం. ఆ ఆత్మ ప్రవేశించేటువంటి శరీరం బట్టి సంస్కారాలుగలవు. జంతువులా పుడితే జంతు సంస్కారం, మానవునిగా పుడితే మానవ సంస్కారం తో ఆ ఆత్మ వెలుగొందుతూ ఉంటుంది. 64 లక్షల  జీవ రాశులలో కేవలము మానవ జాతికే సరైన మేధస్సు, వాక్కు అలాగే ఇంద్రియ నిగ్రహం కలదు. అటువంటి మానవుడికి చాలా రకాల సంస్కారాలు కలవు. కుల, మత. జాతులను బట్టి వారి యొక్క అలవాట్లు, అభిరుచులు, సంస్కారాలు వారి శరీరాన్ని విడిచేంతవరకు అంటిపెట్టుకుని ఉంటాయి. వారు చేసే పుణ్య కర్మలను బట్టి స్వర్గము,పాపాలను కర్మలు బట్టి నరక ప్రాప్తి కలుగును. వారి యొక్క ఆయుః ప్రామాణికం బట్టి ‍‍మరణం సంభవిస్తుంది. శరీరంలో ఆత్మ ఉన్నంత కాలం ఆ శరీరాన్ని శివం (కదులునది) అంటారు. ఎపుడైతే ఆ శారీరం నుంచి ఆత్మ విడిచిపెడుతుందో అప్పటినుంచి ఆ శరీరాన్ని శవం (కదలనిది) అంటారు.

మరణించగానే ఆ వ్యక్తి యొక్క అస్తిత్వం వెంటనే శరీరాన్ని విడిచి వెళ్ళిపోదు. ఎపుడైతే నీరు శరీరని తాకుతుందో అప్పుడు ఆత్మ తన పూర్తి తత్వాన్ని దేహము నుండి వేరు చేసుకుంటుంది. శరీరము పృథివి, వాయువు, అగ్ని,జలం మరియు ఆకాశమను పంచ భూతాలతో నిర్మితమై ఉంటుంది. కావున శవాన్ని మొదట భూమి పైన పెడతారు తరువాత నీటితో శుద్ధి చేస్తారు. అగ్నిలో ఆ దేహాన్ని దాహిస్తారు. కాలిన దేహం వాయు రూపమైన పొగగా ఆకాశంలో లీనమవుతుంది. ఇక ఇటువంటి సంస్కారాలు జరిగిన దేహం యొక్క ఆత్మ పుణ్య లోకాలకు చేరుతుంది. అదే ఏ ఒక్క సంస్కారం జరగకపోయినా, మనస్పూర్తిగా కార్యము జరపకపోయిన లేదా చనిపోయిన వాళ్ళకి ఎదైనా కోరికలు మిగిలియున్నా ఆ ఆత్మకి భందువులైనటువంటి వారి కలలోకి రావటం, రాత్రి పూట కనపడటం ఆ ఇంట్లో వారికి వ్యాధులు రావటం లాంటి దుశ్శకునాలు కనపడుతూ ఉంటాయి.

అటువంటివారు నిత్యమూ గృహములో ఉన్న దేవుని వద్ద దీపారాధనచేసి నిత్యము చేసే స్తోత్రములను, పారాయణలను చేయవలెను. నిత్యము ఇంట్లో దీపారాధన చేసినచో ఆ ఆత్మకి శాంతి కలుగుతుంది.ఆత్మ ఇక్కడనుంచి తన గమ్యాన్ని చేరుకునే మార్గం అంధకారమై ఉంటుంది. కనుక ఎవరైతే సంవత్సరీకం అయ్యేంతవరకు మానకుండా నిత్యమూ దేవుని వద్ద దీపారాధన చేస్తారో చనిపోయినవారి యొక్క ఆత్మకి దారి కనపడి వారి గమ్యాన్ని శాంతిగా చేరుకుంటారు. ఎపుడైతే శ్రద్ధగా సంవత్సరీకం జరిపినారో ఆత్మ నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు.

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here