
What are the 32 Forms of Ganesha?
513. విజయ గణపతి (Vijaya Ganapati) :
ఈ గణపతి రూపానికి 4 చేతులుంటాయి. కుడి వైపు చేతులతో పాశం మరియు విరిగిన దంతం ధరిస్తాడు. ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం మరియు పండిన మామిడి పండు ధరించి దర్శనం ఇస్తారు ఈ గణపతి. కింద ఉన్న మంత్రాన్ని పారాయనం చేయడం వలన మీకు సమస్త విషయాలు చేకూరుస్తారు.
పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః
14. మహాగణపతి (Mahaa Ganapathi) :
ఈ గణపతి రూపానికి 10 చేతులుంటాయి. కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ మరియు విరిగిన దంతం ధరించి ఉంటాడు. ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి దర్శనం ఇస్తారు. ఆయన అనుగ్రహం కోసం కింద ఉన్న మంత్రాన్ని పారాయణం చేయండి.
హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్ బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే
15. ఊర్ధ్వ గణపతి (Urdhva Ganapathi) :
ఈ గణపతికి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం మరియు ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరుకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు ఈ గణపతి. కింద ఉన్న మంత్రాన్ని పారాయణం చేయడం వలన కారాగార బాధ నుంచి విముక్తి కలుగుతుంది.
కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః
16. నృత్య గణపతి (Nritya Ganapati):
ఈ గణపతికి కుడి చేతిలో పాశం, అప్పాలు మరియు ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతంతో ధరించి దర్శనమిస్తారు ఈ గణపతి. ఆయన అనుగ్రహం కోసం కింద ఉన్న మంత్రాన్ని పారాయణం చేయడం వలన సంతృప్తిని మరియు మనశ్శాంతినీ లబిస్తుంది.
పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్ పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్
Related Posts –
శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha
బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వస్తే లాటరీ తగిలినట్లే! | Dream Astrology
https://hariome.com/according-to-numerology-how-to-put-name-to-baby/
https://hariome.com/after-12-years-opposite-rajyog-will-be-formed-due-to-retrograde-jupiter/
Trigrahi Yoga is Formed Due to the Combination of 3 planets in Surya Rasi
https://hariome.com/venus-was-established-to-the-right-of-saturn-opposition/
సూర్యుని సంచారంలో ఏర్పడిన అశుభకరమైన పశ్విక యోగంతో ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం? | Pashvik Yog
https://hariome.com/weekly-horoscope-september-3-to-9-2023-of-each-zodia-sign/
100 ఏళ్ల తరువాత అరుదైన రాజయోగం! ఈ రాశుల వారి సుడి తిరగనుంది! | Kendra Trikon Rajayogam 2023