
Chanakya Niti for Successful Lifestyle You Should Stay Away from These Things
2చాణక్య నీతి సూత్రాలు (Chanakya’s Principles of Ethics)
1. డబ్బు, ఖర్చు అదుపులో ఉండాలి. నిజాయితీగా సంపాదించాలి, భవిష్యత్తు కోసం సొమ్మును కచ్చితంగా పొదుపు చేయాలని చాణక్యుడు చెప్పారు.
2. మనం ఎప్పుడు నీరు ప్రవహించే చోట ఇల్లు కట్టుకోకూడదు. వరదలు లేద సునామీ వచ్చినప్పుడు మీ ఇల్లు నీటిలో మునుగుతుంది లేదా పూర్తిగా ధ్వంసం అయ్యే ప్రమాదముందని చాణక్యుడు తెలిపారు.
3. స్త్రీలను గౌరవించడం భారతీయ సంస్కృతి, ఎవరు ఐతే స్త్రీలను గౌరవిస్తారో వాళ్లకు మంచి పేరుతో పాటు మంచి జరుగుతుంది.
4. తెలివి తక్కువ వారు మరియు వితండవాదం చేసే వాళ్ళకి మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే ప్రతి మాటలో తప్పులు వెతుకుతారు.
5. ఎదుట వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, మర్యాదగా మాట్లాడాలి. ఎదుటి వారికి ఇచ్చే మర్యాదను బట్టి మనకు కూడా మర్యాద ఇస్తారు. మీ మాటలు తో ఎవరిని బాధ పెట్టరాదు. ప్రతిష్ట ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి. గొడవలు మంచిది కాదు.
6. పాములుకు దూరంగా ఉండటం మంచిది. వాటి వల్ల ప్రాణహాని ఉంటుంది.
7. చాణక్య నీతితో అగ్నితో జాగ్రత్తగా ఉండాలి అని చెబుతారు. అగ్ని వెలుగుని ఇస్తుంది కనుక అసలు అగ్నితో ఆటలు ఆడకూడదు. ఒకవేళ ఆడితే అగ్ని మిమ్మల్ని కాల్చేస్తుంది.
8. దురాశ, కోపం, అహంకారం జీవిత భాగస్వామి పై చూపరాదు.
Related Posts