
Beggar / బిచ్చగాడు
విజయ చక్రవర్తి పరిపాలనా కాలమది. ఆగ్రా నగరంలో ఒక బిచ్చగాడు రోజూ బిచ్చమెత్తుకుంటూ దొరికిన నాడు తిని దొరకనినాడు ఇన్ని నీళ్లు తాగి కడుపులో కాళ్లుపెట్టుకుని పడుకుంటూ కాలం గడుపుతుండేవాడు. ఒకరోజు ఆ బిచ్చగాడు “ఇలా కాదు, ఈ చక్రవర్తి చాలా దయామయుడంటారు. ఆయనను దర్శించి తన మనుగడకేదైనా ప్రసాదించమని” అడగాలని నిర్ణయించుకుని, చక్రవర్తి దర్శనార్ధం బయలుదేరాడు. కానీ దారిలో వున్న ఒక మందిరం దగ్గరకి చక్రవర్తి తన కుటుంబ సమేతంగా వస్తున్నాడని తెలుసుకుని తనూ ఆ మందిరం దగ్గరకి వెళ్లాడు.
చక్రవర్తి పరివారంతో మందిరంలోకి వెళ్లాడు. ఆ సమయంలో లోనికి ప్రవేశం నిషిద్దం కాబట్టి బిచ్చగాడు మందిరం బయట ఒక మూల నుంచి లోపల ఏం జరుగుతోందో తొంగిచూస్తున్నాడు. విజయ చక్రవర్తి మందిరంలో ప్రార్థనకు మోకరిల్లి… “భగవంతుడా… నువ్వు సర్వజ్ఞుడవు, సర్వ సమర్థుడవు. నా ప్రజలను జాగ్రత్తగా చూసుకునే శక్తిని నాకు ప్రసాదించు పరమాత్మా!’ అంటూ ప్రార్ధించాడు.ఆ ప్రార్ధన విని బిచ్చగాడు ఆశ్చర్యపోయాడు!
రాజు గొప్పవాడు ఆయన సహాయం అడుక్కుందామని నే వస్తే ఈయనేమిటి, తనకు సహాయం చేయమని దేవుడిని అడుక్కుంటున్నాడు? అలాంటప్పుడు ఈ రాజును అడగడం దేనికి? రాజుకంటే గొప్పవాడైన దేవుడినే నేరుగా అడుక్కుంటే పోలే! రాజు కంటే కూడా శక్తిమంతుడు, గొప్పవాడు ఒకడున్నాడని మరిచిపోయాను ఇన్నాళ్లూ! “పుట్టించిన వాడే ఏదో ఒక దారి చూపుతాడు. మధ్యలో వాళ్లనూ, వీళ్లనూ అడగడం దేనికి, ఆ దేవుడినే అడుగుతా” అని నిశ్చయించుకున్నాడట!
“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”
ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.
వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.
మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి
For More Updates Please Visit www.Hariome.com