Chaitra Amavasya 2025 | చైత్ర అమావాస్య యొక్క ప్రాముఖ్యత, చేయవల్సిన పరిహారాలు

0
2003
Chaitra Amavasya History
Chaitra Amavasya History & Things to Do

Chaitra Amavasya History

1చైత్ర అమావాస్య

హిందూ మతంలో అమావాస్యకి పౌర్ణమిలకి అత్యంత ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇవి నెలకు ఒకసారి చోప్పున ప్రతి నెల వస్తాయి. అమావాస్యని ఒక్కో నెల ఒక్కో పేరుతో పిలుస్తారు. ఎలా అంటే, చైత్ర మాసంలో వచ్చెది చైత్ర అమావాస్య అని అలా పిలుస్తుంటారు. అమావాస్య రోజు దాన ధర్మాలు, నది స్నానం, సుర్యున్ని పూజించడం వల్ల మన పూర్వికులను ప్రసన్నం చేసుకొవచ్చు. అంతటి విశిష్టత కలిగినది అమావాస్య.

ఛైత్ర ఆమావాస్య 2025 తేది (Chaitra Amavasya 2025 Date & Timings)

Chaitra Amavasya Muhurat

అమావాస్య తిథి ప్రారంభం 18:55 మార్చి 28, 2025
అమావాస్య తిథి ముగుస్తుంది 04:27 మార్చి 29, 2025

చైత్ర అమావాస్య యొక్క ప్రాముఖ్యత (Chaitra Amavasya Significance)

హిందు విశ్వాసం ప్రకారం, అమావాస్య రోజు ఎవరైతే పవిత్ర నదిలో స్నానం చేస్తారో వారికి విష్ణు భగవాడుని కౄపను పొందుతారు. ఈ రోజు చంద్రుడిని భక్తి శ్రద్దలతో పూజిస్తే అశీర్వాదంతో పాటు ఆనందం పొందుతారు.

ఆచారాలు (Chaitra Amavasya Religious Rituals)

1. ఈ రోజు సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచి నది స్నానం ఆచరించాలి. నది అందుబాటులో లేకపొతే మన ఇంట్లొనే స్నానం చేసే నీటిలో కొన్ని గంగాజలం వేసి స్నానం చేయవచ్చు.
2. స్నానం చేసిన తర్వాత, సూర్య భగవాడుని మరియు పూర్వీకులను పూజించాలి.
3. తర్వాత, మీ శక్తి మేరకు ధాన్యం, బట్టలు, తెల్లని ఆహార పదార్దాలు లేక మట్టి కుండలు ధానం చేయడం వలన దేవతలు, మన పూర్వీకులు సంతషించి వారికి మోక్షం కలుగుతుంది.

చైత్ర అమావాస్య ప్రాముఖ్యత (Chaitra Amavasya Importance)

పూర్వీకుల విముక్తి కోసం పితృ తర్పణంతో సహా చైత్ర అమావాస్య నాడు వివిధ మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజున ఉపవాసం కేవలం పూర్వీకుల మోక్షాన్ని మరియు శాంతిని అందించడమే కాకుండా, ఉపవాసం చేసే వ్యక్తికి అత్యంత లాభదాయకమైన ఫలితాలను అందిస్తుంది.

చైత్ర అమావాస్య, హిందూ సంవత్సరపు చివరి రోజు (Hindu Year Last Day)

మిగాతా అమావాస్యల కంటే చైత్ర అమావాస్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇది హిందు సంవత్సరంలో చివరి రోజు కాబట్టి. చైత్ర అమావాస్య తర్వాతనే చైత్ర శుక్ల ప్రతిపద వస్తుంది అంటే హిందువుల నూతన సంవత్సరం ఆరంబం. ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించిన రోజు చైత్ర శుక్ల ప్రతిపద అని చెబుతారు.

సంతోషం & శ్రేయస్సు కోసం చైత్ర అమావాస్య నాడు తప్పనిసరిగా చేయవల్సిన పరిహారాలు (Chaitra Amavasya Vrat and Religious Rituals)

1. ఈ రోజు స్వచ్చమైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని ఈశాన్య దిక్కులో ఉంచడం వలన లక్ష్మి దేవి అనుగ్రహం ఎల్లప్పుడు మీకు తోడుగ ఉంటుంది.
2. పేద వారికి ధన సహయం, ఆకలితో ఉన్న వాడికి ఆహరం ఇవ్వండి. దీని వలన మీ కష్టాలు అన్ని తొలిగిపొతాయి.
3. ఆవు పేడ, ఆవు నెయ్యి మరియు బెల్లంతో ధూపం వెలిగించినట్లైతే మీ పూర్వికులను శాంతింపచెయవచ్చు.
4. మీ ఉద్యోగ లేక వ్యాపారల్లో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా మీ జాతకంలో పితృ దోషం ఉన్నట్లయితే, మీరు అమావాస్య నాడు పీపాల చెట్టు క్రింద తప్పనిసరిగా ఆవాల నూనెను వెలిగించాలి. ఇలా చేస్తె కొంత మేర దోషం పోతుంది.
5. పితృ తర్పణం లేదా శ్రాద్ధం చేసిన తర్వాత పేదలకు లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టండి.

Related Posts

కొత్త అమావాస్య | Kotha Amavasya in Telugu

https://hariome.com/2023-festival-calendar/

ఆ పువ్వులతో అంత పుణ్యం | Benefits of offering flowers to God in Telugu

నవరాత్రులు ఎప్పుడు ఆర౦భి౦చాలి?

Indira Ekadashi 2025 | ఇందిరా ఏకాదశి ఆచరించడం వల్ల పితృ దోష సమస్యలు తొలుగుతాయి.

శంకరులు చేసిన చతుఃషష్టి ఉపచారాలు

Sravana Pournami Significance in Telugu? | శ్రావణ పౌర్ణమి ప్రాముక్యత ఏమిటి ?

Naga Panchami Significance in Telugu | నాగ పంచమి! నాగ పంచమి ప్రాముఖ్యత ఏమిటి ?

బోనాల సంబురాలు ? | Bonalu Festival Celebrations in Telugu ?

Vamana Jayanti in Telugu | వామన జయంతి కథ & పూజా విశిష్టత

శ్రావణమాసంలో పాటించవల్సిన నియమాలు ఏమిటి ? | Importance of Sravana Masam in Telugu

Shani Trayodashi | శని త్రయోదశి ప్రాముఖ్యత, శని దోషాల విముక్తికై పాటించవలసిన నియమములు

ఈ రోజు పూర్ణిమ

శివుడు వచ్చి వెళుతున్న ప్రదేశం ఎక్కడ ఉందొ మీకు తెలుసా?

Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?