
Gastric Troubles Remedies
ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ సమస్య లేనివారు అతి తక్కువ మంది. దీనికి గల ముఖ్య కారణం మారిన జీవనశైలి విధానమే అని చెప్పవచ్చు. క్షణం తీరిక లేక యంత్రాలతో పరిగెడుతూ వేళకు ఆహారం తీసుకోక, ఒక వేళ అహారం తీసుకున్నా క్షణాలలో హడావిడిగా ముగించటం, దీనితో పాటుగా తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టక పోవడం, ఆలోచనలతో మనసు నిలకడ లేకుండా పరిగెత్తడం, కారణం లేకుండానే కోపం రావటం వంటి మానసిక సమస్యలతో బాటు సరైన అహారం తీసుకోక పోవటంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి అందరిని వేధిస్తోంది.
5. కొన్ని సులభ చికిత్సలు
- ప్రతి రోజు ఉదయాన్నే అరటి బోదలోని సన్నని గట్టిగా ఉండే ‘అరటి ఊచ’ రసాన్ని ఒక కప్పుడు తాగుతుంటే 15-20 రోజుల్లో గ్యాస్ సమస్య తగ్గుతుంది.
- అల్లం రసం పొంగించి దానిలో బెల్లం పొడి కొద్దిగా కలిపి ఒక టేబుల్ స్పూన్ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మల మూత్రాలు సులభంగా అవుతాయి.
- 40 గ్రాముల ఎండు ద్రాక్షపళ్ళను రాత్రి వేడి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ పండ్లను బాగా పిసికి వడగట్టి తాగుతుంటే సులభంగా విరేచనమై కడుపులోని చెడుగాలి పోతుంది.
- శొంఠి చూర్ణం, పాత బెల్లంతో సమంగా కలిపి ప్రతిరోజు ఉదయాన్నే తిని వేడి నీరు తాగితే సులభంగా విరేచనమై కడుపులో చెడుగాలి పోతుంది. దీనివల్ల మూలవ్యాధి, మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
- ధనియాలు, శొంఠి సమభాగాలు కలిపి కషాయం పెట్టి కప్పు కషాయం ఉదయాన్నే తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గి గ్యాస్‌ట్రబుల్ కూడా తగ్గిపోతుంది.
- సోంపు, జీలకర్ర, వాయు సమభాగాలు చూర్ణం చేసి కలిపి టీ స్పూన్ రోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత వేడి నీటితో వాడితే కడుపులోని చెడుగాలి పోయి శుభవిరేచనం అవుతుంది.
- సునాముఖి ఆకుపౌడరు, కరక్కాయ పౌడరు సమభాగాలుగా కలిపి రోజూ ఒక గ్రాము మూడు పూటలా వాడితే సులభంగా విరేచనమై చెడుగాలి తగ్గిపోతుంది.
డాక్టర్ కందమూరి — ఆయుర్విజ్ఞాన కేంద్రం
Promoted Content