ఆపదమొక్కులవాడు అన్న పేరులోని అర్థం, పరమార్థం | Meaning of Apadamokkulavadu in Telugu

0
10597
om namo venkatesaya
Meaning of Apadamokkulavadu in Telugu 

Lord Venkateshwara Swamy

1. ఎన్ని పేర్లో! ఎంతటి అర్ధమో!

తిరుమల దేవునికి ఎన్నో, ఎన్నెన్నో పేర్లున్నాయి. శ్రీనివాసుడు, మంగపతి, శేషాచలపతి, వేంకటపతి, వేంకటేశ్వరుడు, తిరుమలేశుడు, సప్తగిరీశుడు, కలియుగ దేవుడు, ఏడుకొండలవాడు, వడ్డీకాసులవాడు, ఆపదమొక్కులవాడు, అడుగడుగుదండాలవాడు, గోవిందుడు, శ్రీవారు, శ్రీనిలయుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు – ఇలా ఎన్నో పేర్లతో గోవిందుని భక్తులు పిలుస్తుంటారు. గిరిశిఖరాలపై కొలువున్న ఆ శ్రీ వేంకటేశ్వరుని చాలా పేర్లకు మనకు అర్ధాలు తెలియవు. ఆయా పేర్లలోని ఔచిత్యం చాలామందికి బోధపడదు.

తిరుమల శ్రీనివాసుని పేర్లలోని కొన్నింటి ఔచిత్యాన్ని పరిశీలించి, అవగాహన చేసుకుంటే మనందరి కోసమే ఆ శ్రీవారు ఈ బిరుదు లన్నింటినీ తగిలించుకున్నాడేమో అని అని పించకపోదు.

ఆపదమొక్కులవాడు అన్న పేరులోని అర్థం, పరమార్థం

ఇక ఆ తిరుమలేశుని ప్రజలంతా “ఆపదమొక్కులవాడా! గోవిందా! ” అని ప్రార్ధిస్తూ ఉంటారు. కారణం – మనిషికి కన్ను తెరిచింది మొదలు కన్ను మూసేంత వరకూ అనేకానేక ప్రమాదాలు ఎప్పడూ పొంచి ఉంటాయి. వీటి నుండి మనల్ని కాపాడేందుకు ఒక మహత్తరమైన శక్తి కావాలి. ఆ శక్తి కలియుగంలో తిరుమల గిరి శిఖరాలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు. ఇక్కడ ప్రమాదాలు అనేకానేక విధాలుగా ఉంటాయి.

అవి బాహ్యమైనవి, అంతర్గతమైనవి అని రెండు విధాలుగా ఉంటాయి. ప్రమాదాలు బాహ్యప్రమాదాలుగా భావిస్తే, మన శరీరం లోపల, మనకు తెలీకుండానే జరిగే ప్రమాదాలు అనేకం ఉంటాయి. మన శరీరంలో మనకు తెలీకుండానే అనేక కారణాల వల్ల క్రిములు ఉద్భవిస్తూ ఉంటాయి. అవి “ఇంతింతై వటుడింతింతై” అన్న రీతిగా శరీరమంతా వ్యాపించి మనిషిని అనారోగ్యానికి గురి చేస్తాయి. ఈ అనారోగ్యం శారీరక అస్థిరత నుండి మానసిక అస్థిరతకు దారితీసి, మనిషికి బ్రతుకు మీద అయిష్టతను కల్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో మరణానికి దగ్గరగా తీసుకుపోవడం, ఒక్కొక్కసారి మనిషి మృతి చెందటం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాల నుండి మనల్ని కాపాడగల్లినవాడు ఆ దేవదేవుడొక్కడే. అందుకే తిరుమలేశుని అనేక విధాలుగా ప్రార్థిస్తాం. మొక్కుకుంటాం. ఆపదలను పార ద్రోలమని వేడుకుంటాం. అందుకే ఆ శ్రీనివాసుని భక్తులందరూ “ఆపదమొక్కులవాడా! అడుగడుగు దండాల వాడా!” అంటూ “త్వమేవ శరణం మమ” అంటారు పాదాక్రాంతులవుతారు.

వడ్డికాసులవాడు అన్న పేరులోని అర్థం, పరమార్థం | Story of vaddi kasula vadu in Telugu

శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయి?! | What Are The Results of Done the Lord Venkateshwara Swamy Darshan On Individual Day?!

Kali Santaraka Stotram | కలిసంతారక స్తోత్రమ్ Lord Venkateshwara Stotras

తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా? | ఏ రోజు ఏ ప్రసాదం?, వాటిని స్వీకరిస్తే కలిగే ఫలితాలు?! | Types of Prasads Offering to Sri Venkateshwara Swamy

శ్రీవారికి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు? దాని విశిష్టత ఏమిటి? | Why Green Camphor applied to Tirumala Venkateswara

 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here