
why shouldnt we eat amla
1. ఉసిరికాయ ప్రత్యేకత
ఉసిరికాయ విష్ణు స్వరూపం. ప్రతి ఇంట్లోనూ ఉసిరికాయ తప్పని సరిగా ఉండాలంటారు. ఉసిరికాయ ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలకు నిలయం. ఉసిరికాయ తినడం వల్ల అజీర్తి సమస్యలు, జుట్టురాలడం తగ్గి, శరీరం లోని మలినాలు తొలగుతాయి. శరీరం లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సంతాన సమస్యలు తొలగుతాయి. శరీరం లో ఏర్పడే త్రిదోషాలు (వాత, పిత్త, కఫ దోషాలు)తొలగుతాయి. ఉసిరి దీర్ఘాయువుని ప్రసాదిస్తుంది. మరి అటువంటి ఉసిరికాయను రాత్రి పూట,ఆదివారం నాడు తినకూడదు అని ఎందుకు అంటారు?
ఉసిరికాయ రాత్రిపూట ఎందుకు తినకూడదు?
ఉసిరికాయ లో ఉండే సి విటమిన్ పేగులలో ఆమ్లాన్ని పెంచుతుంది. రాత్రిపూట ఆమ్లాలు తినడం వల్ల ఆహారం జీర్ణం కాదు. అజీర్తివల్ల గుండె మంట వంటివి కలుగవచ్చు. అంతేకాక ఉసిరికాయ శక్తిని ప్రేరేపిస్తుంది. రాత్రిపూట ఉసిరికాయ తినడం వల్ల అందులోని శక్తి ప్రేరేపకం మనల్ని సుఖనిద్రకు దూరం చేస్తుంది. రక్తప్రసరణ వేగవంతం కావడంవలన కొందరికి ఆందోళన కలుగవచ్చు. అందుకని రాత్రిపూట ఉసిరికాయ తినకూడదు అంటారు.
ఆదివారం ఉసిరికాయ ఎందుకు తిన కూడదు ?
ఉసిరిక లో సూర్య శక్తి దాగి ఉంటుంది. సూర్యునికి ప్రధానమైన ఆదివారం నాడు ఉసిరికాయకు మరింత బలం చేకూరుతుంది. అటువంటి ఉసిరికాయని ఆరోజంతా కదిలించకుండా తరువాతిరోజు తినడం వల్ల విశేష ఫలితాలుంటాయి. అందుకని ఆదివారం నాడే ఆ ఉసిరికాయను తినడం వల్ల తరువాతిరోజు మనం పొందబోయే విశేష ఫలితాలను కోల్పోకుండా, ఆ నియమాన్ని ఏర్పరిచారు. కొందరు శుక్రవారం పూట కూడా ఉసిరికాయని తినకూడదనే నియమాన్ని పాటిస్తారు. శుక్ర ప్రభావం ఉండే శుక్రవారం నాడు వేడిని, ఉద్రేకాన్ని ప్రేరేపించే ఉసిరి తినకూడదు అంటారు.
Related Posts
జాంబవంతుడు ఇంకా బతికే ఉన్నాడు? ఎక్కడో తెలుసా?! | Jambavantha Story in Ramayan
దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గణపతిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi
[…] రాత్రిపూట మరియు ఆదివారం నాడు ఉసిరికా… […]
Why is it advised not to eat Amla at night and on Sundays ?
Read the post for complete Details